సెప్టెంబర్‌లోనే కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక కమిటీ

Uttam Kumar Reddy Comments On Prepolls In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించడానికి మంగళవారం టీపీసీసీ ముఖ్య నాయకులు గాంధీభవన్‌లో సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కమిటీ వేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మైనార్టీలను మోసం చేశారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీలో కేసీఆర్‌ 12 శాతం రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ మోసాన్ని మైనార్టీలు గుర్తించాలని కోరారు.
 
తాము కూడా పార్టీ అంతర్గత సమావేశాలు పెట్టుకుంటున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 75కు పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఎప్పుడు జరుగుతాయనే దానిపై స్పష్టత వచ్చాక బస్సు యాత్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పొత్తులపై కూడా చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరన్నది ఎన్నికల తర్వాతే నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ది ఆవేదన సభ మాత్రమేనని విమర్శించారు. దానికి ధీటుగా జవాబు చెప్తామన్నారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top