కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించాలి

uttam kumar reddy commented over kcr - Sakshi

న్యాయవాదుల సదస్సులో ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తున్న సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం టీపీసీసీ లీగల్‌సెల్‌ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన న్యాయవాదుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఆర్‌.సి.కుంతియా, మండ లిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లా డుతూ రాష్ట్రంలో మానవ హక్కులపై ప్రభుత్వం, పోలీసులు చేస్తున్న దాడులపై న్యాయవాదులు అగ్రభాగాన ఉంటూ పోరాడాలని సూచించారు. ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో లీగల్‌ సెల్‌నుంచి ఒక న్యాయవాది పూర్తికాలం కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల కోసమే పనిచేయాలన్నారు.

మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఇసుక మాఫి యాను ప్రశ్నించినందుకు దళితులను, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని చిత్రహింసలకు గురిచేశారని ఉత్తమ్‌ విమర్శించారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌.సి.కుంతియా మాట్లాడుతూ భూసేకరణ పేరుతో రైతులనుంచి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అక్రమంగా, బలవంతంగా భూమిని గుంజుకుంటోందని విమర్శించారు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top