మాది లెఫ్టూ కాదు.. రైటూ కాదు..!

Twitter Generation .. Who Does Not Listen! - Sakshi

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పట్టణ యువత పాత్ర కీలకం కానుంది. సిద్ధాంత రాద్ధాంతాలతో సంబంధం లేకుండా, సమాజంలోని విభిన్న అంశాలపై సామాజిక మాధ్యమాల్లో తమ వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెబుతోన్న అర్బన్‌ యూత్‌ రేపటి ఎన్నికల్లో ఇటు లెఫ్టో, అటు రైటో కాకుండా మధ్యేమార్గాన్ని అనుసరిస్తామనీ తేల్చి చెబుతోంది. గుడ్డిగా ఏ రాజకీయ పార్టీల వెంటా పరుగులు తీయకుండా తమదైన రీతిలో ఆయా అంశాలను బట్టి్ట స్పందిస్తామని అంటోంది. రాజకీయాంశాలపైనా, సామాజిక విషయాలపైనా స్పష్టమైన అవగాహనను వ్యక్తీకరిస్తూ తమ ట్విటర్‌ అకౌంట్లలో లక్షల సంఖ్యలో ఫాలోయర్స్‌ని సంపాదించుకున్న యువతరం 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ, రాహుల్‌ భవితవ్యాన్ని నిర్ణయిస్తారనే వార్తలు రాజకీయ నిపుణుల్లో చర్చనీయాంశమయ్యాయి.

నిక్కచ్చిగా ఉంటారు..
ప్రధానంగా పట్టణప్రాంతాల్లోని యువత లెఫ్టూ రైటూ కాకుండా భిన్నమైన మార్గాన్ని అనుసరించాలని భావిస్తున్నట్టు సెంట్రిస్ట్‌ పారాడాక్స్‌ సిద్ధాంత రచయిత, రాజకీయ నిపుణులు డేవిడ్‌ అడ్లర్‌ అభిప్రాయపడ్డారు. విద్యావంతులైన పట్టణ ప్రాంత యువతరం దేశాన్ని బాగుచేయాలని ఆకాంక్షిస్తూ, తమవంతు అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పడం ఇప్పుడు వస్తున్న పెద్ద మార్పు అని డేవిడ్‌ అంటున్నారు. 

రెండు పార్టీలదీ ఒకేదారి...
’’ నెహ్రూతో సోషలిస్టు శకం ప్రారంభమైతే ఇందిరాగాంధీతో అది ఉన్నత స్థాయికి చేరింది. అప్పుడు బీజేపీ ప్రముఖులు ప్రస్తుతించారు. అయితే కాంగ్రెస్‌కే చెందిన పీవీ నరసింహరావు సరళీకరణ ఆర్థిక విధానాలకు శ్రీకారం చుట్టారు. అప్పుడు బీజేపీ దాన్ని తీవ్రంగా ఎండగట్టింది. కానీ ఇప్పుడు రెండు పార్టీలూ అదే విధానాన్ని అనుసరిస్తూ  పార్టీకి భారీగా విరాళాలిచ్చే వారికోసం పనిచేస్తున్నాయి అని ఢిల్లీకి చెందిన 35 ఏళ్ళ సిద్ధార్థ భాస్కర్‌ అభిప్రాయపడ్డారు.  ఆర్థికాంశాల్లో ఇటు బీజేపీకీ, అటు కాంగ్రెస్‌కీ పెద్ద తేడాలేదనీ, ఎందుకంటే ఈ రెండూ కూడా బడాపారిశ్రామిక వేత్తలవైపే మొగ్గుచూపుతున్నాయనీ నవయువతరం అభిప్రాయపడుతోంది. కనుక వివిధ అంశాలను బట్టి మాత్రమే తమ మద్దతు ఉంటుంది తప్ప అన్నింటికీ ఒకేరకమైన స్పందనకి ఆస్కారంలేదని యువభారతం స్పష్టం చేస్తోంది. 

క్లిష్ట సమయమే....
గత సార్వత్రిక ఎన్నికల్లో 18–35 ఏళ్ల మధ్య వయస్కులైన దాదాపు 30 కోట్ల మందిలో మూడోవంతు మంది బీజేపీకి ఓటు వేసినట్టు 2014 నేషనల్‌ ఎలక్షన్‌ స్టడీ పోస్ట్‌ పోల్‌ సర్వే వెల్లడించింది. ఐదేళ్ళ క్రితంలా కాకుండా 2019 ఎన్నికల్లో సిద్ధాంతాలతో సంబంధంలేని యువతరం పరిస్థితి భిన్నంగా ఉండబోతోందని స్పష్టం అవుతోంది.

అత్తెసరు మెజారిటీ ఉండాలి...
ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల వరుణ్‌ సూద్‌ తాను కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదనీ, బీజేపీ అధికారంలో కొనసాగాలని భావిస్తున్నాననీ, అయితే ఆ పార్టీ సంఖ్యాబలం మరీ ఎక్కువగా ఉండకూడదని, పాలక, ప్రతిపక్షాల మధ్య తేడా ఎక్కువగా ఉండకూడదని చెప్పారు. అంతేకాదు ఇప్పుడు బీజేపీ అనుసరిస్తోన్న విధానాల్లో చాలా మార్పులు అనివార్యమనేది వరుణ్‌ మాట.

మత రాజకీయం వద్దు...గుడ్డిగా ఏదో ఓ పార్టీని సమర్థించకుండా, అంశాలను బట్టే తమ మద్దతు ఉంటుందని యువత తేల్చి చెపుతోంది. అయితే ఇంటర్‌నెట్‌ విరివిగా వాడే యువ ఓటర్లపై ఈ వైఖరి ప్రభావం ఎక్కువగా ఉంది. ట్విట్టర్‌లో గబ్బర్‌సింగ్‌గా పిలుచుకునే బిహార్, మధ్యప్రదేశ్‌లలో పెరిగిన అభిషేక్‌ ఆస్థానాకి 12 లక్షల  మంది ట్విట్టర్‌ ఫాలోయర్స్‌ ఉన్నారు. మతం పేరుతో ప్రజలను చీల్చే యోగి ఆదిత్యనాథ్‌ లాంటి నేతలను ప్రోత్సహిస్తోన్న మోదీ ప్రభుత్వాన్ని తాను వ్యతిరేకిస్తాననీ, అయితే బుల్లెట్‌ ట్రైన్,  హైవేల నిర్మాణం వంటి వాటిని సమర్థిస్తానని అంటారీయన.

అంశాలే ప్రాతిపదిక...
యువత సంప్రదాయవాదం వైపు మొగ్గు చూపుతారా? లేక ఉదారవాదాన్ని సమర్థిస్తారా అన్న ప్రశ్నకు ఈ రెండూ కాకుండా, మధ్యేమార్గం వైపు యువతరం అడుగులు వేస్తున్నట్టు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సిద్ధాం తాలకు పూర్తిగా కట్టుబడిపోకుండా ఇప్పటి యువత ప్రతి అంశంలో తమదైన సొంత వైఖరి అవలంభిస్తున్నారు. హరియాణాకి చెందిన 24 ఏళ్ల యువకుడు ధృవ్‌ రాఠీ తాను అనుసరిస్తోన్న మధ్యేమార్గాన్ని చాలామంది అంగీకరిస్తారని భావిస్తున్నారు. «ధృవ్‌ రాఠీ కి ట్విట్టర్‌లో 1.6 లక్షల మంది ఫాలోవర్స్, యూట్యూబ్‌లో 1.5 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. తాను సెంట్రిస్ట్‌గా ప్రకటించుకొంటోన్న ధృవ్‌రాఠీ  ‘నేను వామపక్షరాజకీయాల్లో కానీ హిందూత్వ రాజకీయాల్లో కానీ లేను’ అని చెప్పారు. 
 

నోట్ల రద్దు నుంచి కశ్మీర్‌ వరకు...
డీమానిటైజేషన్‌ విఫలయత్నంగా యువత భావిస్తోంది. ప్రారంభంలో కొన్ని అవాంతరాలెదురైనా జీఎస్‌టీ కీలకమైన ప్రయత్నమని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే, రోహింగ్యాల సమస్య తీవ్రమైనదని, సమస్య పరిష్కారానికి మనవంతు సాయం చేయాలనీ కోరుకుంటూనే ఇప్పటికే ఉన్న కోట్లాదిమంది సంక్షేమాన్ని గురించి ఆలోచించాల్సి ఉంది కనుక దేశం రోహింగ్యాల బాధ్యతను తీసుకోలేదనీ వీరంతా అభిప్రాయపడుతున్నారు. అలాగే కశ్మీర్‌ విషయంలోనూ చర్చల ద్వారా సమస్యని పరిష్కరించుకోవచ్చని అంటున్నారు. 

రిజర్వేషన్లకు ఓకే కానీ....
అణగారిన వర్గాలకు కొన్ని షరతులతో కూడిన రిజర్వేషన్లను చాలా వరకు యువతరం అంగీకరిస్తోంది. అయితే ఆర్థిక ప్రాతిపదికన కోటా ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇదే నేపథ్యంలో బీజేపీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకోసం 10 శాతం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. అయితే రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలనీ, అందుకే మహిళా రిజర్వేషన్‌ బిల్లుని తాము కోరుకుంటున్నామనీ యువతులు స్పష్టం చేస్తున్నారు. నిజానికి సోషల్‌ మీడియాలో చురుకుగా ఉన్న ఈ పట్టణ యువత హిందూత్వం వైపు మొగ్గుచూపుతారనే భావన చాలా మందిలో ఉంది. అయితే యువ మధ్యేవాదులంతా విభిన్నంగా ఉన్నారు. ఇంటర్‌నెట్, విద్య, అంతర్జాతీయ అంశాలెన్నో వారిని ప్రభావితం చేస్తున్నాయి. దీంతో 2019 ఎన్నికల్లో వీరు ఎవరికి ఓటు వేస్తారనేది చెప్పలేని పరిస్థితి ఉంది.  

మరిన్ని వార్తలు

20-03-2019
Mar 20, 2019, 20:29 IST
శుక్రవారం ఉదయం పులివెందులలో నామినేషన్‌ దాఖలు చేయనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి
20-03-2019
Mar 20, 2019, 20:23 IST
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న బీజేపీ నేతలు...
20-03-2019
Mar 20, 2019, 19:58 IST
నా అభ్యర్థిత్వాన్ని నాశనం చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారు. నాపై గతంలో కొట్టి వేసిన..
20-03-2019
Mar 20, 2019, 19:37 IST
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని మాడుగుల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అన్న...
20-03-2019
Mar 20, 2019, 19:33 IST
టీడీపీ అరాచక పాలనపై ఏపీ ప్రజలు విసుగెత్తిపోయారని అందుకే మార్పురావాలని కోరుకుంటున్నారన్నారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు.  ...
20-03-2019
Mar 20, 2019, 19:24 IST
సాక్షి, గద్వాల: తెలంగాణ పీసీసీ నాయకత్వ వైఫల్యం కారణంగానే కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాజయాలు ఎదురవుతున్నాయని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. పార్టీ మారినందుకు తానను వ్యక్తిగతంగా...
20-03-2019
Mar 20, 2019, 19:02 IST
నువ్వు నాకు చెప్పేదేంటని ఆగ్రహంతో లక్ష్మారెడ్డిపై చలమారెడ్డి చేయి చేసుకున్నారు.
20-03-2019
Mar 20, 2019, 18:48 IST
ఆప్‌తో పొత్తు పెట్టుకునే విశయమై ‘టు బీ నాట్‌ టు బీ’ అన్న సందిగ్ధంలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ కొట్టు...
20-03-2019
Mar 20, 2019, 18:02 IST
పట్నా: బీజేపీ రెబ‌ల్‌ ఎంపీ ఎంపీ శ‌తృఘ్న సిన్హా.. ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత...
20-03-2019
Mar 20, 2019, 17:43 IST
తక్షణమే మాధవ్‌ వీఆర్‌ఎస్‌ను ఆమోదించాలని ట్రిబ్యునల్‌.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
20-03-2019
Mar 20, 2019, 17:29 IST
భువనేశ్వర్‌: ఒడిషా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌ పార్టీ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ బుధవారం నామినేషన్‌ వేశారు. ఆయన మొదటిసారి...
20-03-2019
Mar 20, 2019, 17:23 IST
సాక్షి, పలమనేరు(చిత్తూరు): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ నేరం చేయకపోతే.. సీబీఐకి, ఈడీకి, తెలంగాణ పోలీసులకు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్‌...
20-03-2019
Mar 20, 2019, 17:16 IST
ఎన్నికల సమీపిస్తున్నా టీడీపీలో అసమ్మతి చల్లారలేదు.
20-03-2019
Mar 20, 2019, 17:15 IST
సాక్షి, కర్నూలు: తెలుగుతేశం పార్టీ నేతలు ఎన్నికల కోడ్‌ను అడుగడుగునా ఉల్లంఘిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉన్నా కూడా పట్టించుకొవడం లేదు. నిబంధనలంటే తమకు లెక్కలేదన్నట్టుగా...
20-03-2019
Mar 20, 2019, 17:10 IST
భౌతికకాయంపై ఉంచిన పువ్వులు వాడనే లేదు. ఆయన చితాభస్మం చల్లారనూ లేదు.
20-03-2019
Mar 20, 2019, 16:44 IST
శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) మధ్య పొత్తు చిగురించింది. మొత్తం 6 లోక్‌సభ స్థానాలు ఉన్న...
20-03-2019
Mar 20, 2019, 16:24 IST
అభ్యర్థుల ముఖం కాదు ..నా ముఖం చూసి కేసీఆర్ ఓటేయమంటున్నారు.
20-03-2019
Mar 20, 2019, 16:12 IST
సాక్షి, పశ్చమ గోదావరి: తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ...
20-03-2019
Mar 20, 2019, 16:01 IST
న్యూఢిల్లీ: దేశ రాజకీయల్లో గత కొన్ని రోజులుగా చౌకీదార్‌ అనే పదం బాగా పాపులరైంది. ప్రధాని నరేంద్రమోదీ తనను తాను...
20-03-2019
Mar 20, 2019, 15:58 IST
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీలిస్తుంటారు. ఆ తర్వాత పట్టించుకోరు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, అసెంబ్లీ అభ్యర్థి పరసా...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top