ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కాలి

TTDP Leaders Have Joined the BJP Heavily - Sakshi

కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను విముక్తం చేయాలి 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆ నలుగురిపాలు అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి చేయడానికి ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కా లని పిలుపునిచ్చారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో లక్ష్మణ్‌ ప్రసంగించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. బీజేపీలో చేరడానికి నేతలు, కార్యకర్తలు రావడం పెను మార్పు అని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. టీడీపీ నేతలు ఉప్పెనలా బీజేపీలోకి తరలిరావడం శుభపరిణామమని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. 

బాబు బాగుండాలి: గరికపాటి 
ఎన్టీఆర్‌ చూపిన అభిమానంతో టీడీపీలో చేరానని, కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉన్నానని ఎంపీ గరికపాటి మోహన్‌రావు తెలిపారు. అయితే, తెలంగాణ వచ్చాక పరిస్థితి మారిపోయిందన్నారు. మనసు రాయి చేసుకొని టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని వచ్చానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

బీజేపీలో చేరిన టీడీపీ నేతలు వీరే... 
గరికపాటి మోహన్‌రావు–రాజ్యసభ సభ్యుడు, శోభారాణి–తెలుగు మహిళ అధ్యక్షురాలు, దీపక్‌రెడ్డి–టీడీపీ జనరల్‌ సెక్రటరీ, ఈగ మల్లేశం–వరంగల్‌ రూరల్‌ అధ్యక్షుడు, రజనీకుమారి–తుంగతుర్తి ఇన్‌చార్జి, పోరిక జగన్‌ నాయక్‌–మాజీ మంత్రి, ఎర్ర శేఖర్‌–మాజీ ఎమ్మెల్యే, మొవ్వ సత్యనారాయణ–శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జి, ముజఫర్‌–మలక్‌పేట్‌ టీడీపీ ఇన్‌చార్జి, సామ రంగారెడ్డి–రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, కోనేరు చిన్ని–కొత్తగూడం జిల్లా అధ్యక్షుడు, శ్రీకాంత్‌ గౌడ్‌–పఠాన్‌ చెరు ఇన్‌చార్జి, బోట్ల శ్రీనివాస్‌–జనగామ జిల్లా అధ్యక్షుడు, రాజ్యవర్ధన్‌రెడ్డి–కాంగ్రెస్‌ నేత, శ్రీనివాస్‌గౌడ్‌–నల్లగొండ ఇన్‌చార్జ్, అంజయ్య యాదవ్‌–నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి, సాధినేని శ్రీనివాస్‌–మిర్యాలగూడ అసెంబ్లీ ఇన్‌చార్జి, శ్రీకళారెడ్డి–కోదాడ నేత, ఓం ప్రకాశ్‌

మాజీ తెలుగు విద్యార్థి నేత, బాబురావునాయక్‌–టీడీపీ ఎస్టీ సెల్, విజయ్‌పాల్‌రెడ్డి–మాజీ ఎమ్మెల్యే నారాయణ ఖేడ్, ఉపేందర్‌–కాంగ్రెస్‌ నేత, సత్యం–మంచిర్యాల టీడీపీ అధ్యక్షుడు, రఘునాథ్‌రెడ్డి–భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, రామ్‌రెడ్డి–సూర్యాపేట ఇన్‌చార్జి, జయశ్రీ–టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top