ఉప ఎన్నికల్లో గులాబీ హవా

TRS victory in the byelection - Sakshi

     16 ఎంపీటీసీ స్థానాల్లో 10 కైవసం  

     కాంగ్రెస్, బీజేపీలకు చెరో రెండు  

     రెండు స్థానాలను గెలుచుకున్న స్వతంత్రులు

సాక్షి, హైదరాబాద్‌: మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల(ఎంపీటీసీ) ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ సత్తా చాటింది. రాష్ట్రంలో 16 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 10 స్థానాలను టీఆర్‌ఎస్, చెరో రెండు స్థానాలను కాంగ్రెస్, బీజేపీలు కైవసం చేసుకోగా, రెండు స్థానాలను స్వతంత్రులు గెలుచుకున్నారు. శనివారం వెలువడిన ఫలితాల్లో.. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా నెట్నూరు(సిర్పూర్‌ మండలం), కోరుట్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుశాపూర్, కొత్తగూడెం భద్రాచలం జిల్లా భద్రాచలం–7, ఖమ్మం జిల్లా జక్కెపల్లి (కుసుమంచి మండలం), మహబూబ్‌నగర్‌ జిల్లా కన్మనూరు (నార్వ మండలం), వనపర్తి జిల్లా గోపైదిన్నె (పానగల్‌ మండలం), నల్లగొండ జిల్లా కిష్టాపురం (మునుగోడు మండలం), ఎర్రబెల్లి (నిడ్మనూరు), రంగారెడ్డి జిల్లా జాన్వాడ (శంకరపల్లి మండలం) స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. కరీంనగర్‌ జిల్లా అచ్చంపల్లి (గంగాధర మండలం), సిద్దిపేట జిల్లా అకునూర్‌–1(చెర్యాల మండలం) స్థానాలను కాంగ్రెస్, కరీంనగర్‌ జిల్లా గంగాధర, కామారెడ్డి జిల్లా మద్నూరు–2 స్థానాలను బీజేపీ, మహబూబ్‌నగర్‌ జిల్లా లింగంపల్లి (మక్తల్‌ మండలం), రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడ (శంషాబాద్‌ మండలం) స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top