23 నుంచి తెలంగాణ అసెంబ్లీ!

Telangana assembly sessions may start on october 23 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆరోజు కుదరకపోతే 25ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 29తో అసెంబ్లీ సమావేశాలు ముగిసి 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశాల తేదీ ఖరారు చేస్తారని సమాచారం. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయాన్ని బీఏసీలో నిర్ణయిస్తారు. ఈసారి సమావేశాల్లో 8 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top