తిక్కారెడ్డికి షాక్‌

TDP Leaders Join In YSRCP Kurnool - Sakshi

టీడీపీ నుంచి 300 మంది వైఎస్సార్‌సీపీలో చేరిక

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి

కర్నూలు, మంత్రాలయం రూరల్‌ /కోసిగి: టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిక్కారెడ్డికి సొంత పార్టీ నేతలు షాక్‌ ఇచ్చారు. గురువారం మంత్రాలయం మండలంలోని సూగూరు గ్రామానికి చెందిన గోపిస్వామి, రాఘవరెడ్డితో పాటు మాధవరం తండాకు చెందిన నాయక్‌ ఆధ్వర్యంలో 250 మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. అలాగే పెద్దతాయప్ప ఆధ్వర్యంలో కోసిగిలోని రంగప్ప, గట్టు, శ్రీరామ టాకీస్‌ సమీప కాలనీలకు చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరందరిని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. రాష్ట్రంలో ప్రజలు రాక్షస పాలనకు స్వస్తి చెప్పి రాజన్న రాజ్యం కోరుకుంటున్నారన్నారు.

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు మంత్రాలయం ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి రాఘవేంద్ర సర్కిల్‌కు చేరుకుని దివంగత సీఎం వైఎస్సార్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి దుర్గారమణ కళ్యాణ మండపం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు వై. సీతారామిరెడ్డి, పార్టీ రాష్ట్ర యువజన సంఘం కమిటీ సభ్యులు వై. ప్రదీప్‌ కుమార్‌ రెడ్డి, మంత్రాలయం, కోసిగి మండల అధ్యక్షులు భీంరెడ్డి, రాంపురం మురళీధర్‌ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మయ్య, పట్టణ అధ్యక్షుడు సత్తిరాజు, మాజీ సర్పంచ్‌ భీమయ్య, ఉప సర్పంచ్‌ గోరుకల్లు కృష్ణస్వామి, నాయకులు అశోక్‌ రెడ్డి, హోటల్‌ పరమేష్, శివకుమార్, మల్లికార్జున, అశోక్‌ కుమార్, పవన్, జక్కయ్య, అనుమంతు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top