టీడీపీపై విరక్తితోనే వైఎస్సార్‌ సీపీ వైపు..

TDP Leaders join In YSR CP In West Godavari - Sakshi

తోచలక గ్రామంలో వైఎస్సార్‌ సీపీలో చేరిన నేతలు

పశ్చిమగోదావరి, లింగపాలెం: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరాచకాలను చూసి తట్టుకోలేక ఆ పార్టీ నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వైపు మక్కువ చూపుతున్నారని వైఎస్సార్‌ సీపీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. లింగపాలెం మండలం తోచలక గ్రామంలో బుధవారం పార్టీ మండల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ కార్యకర్తలు సూదగాని రామలింగం, చలమాల వెంకటేశ్వరరావు, వంగల వెంకటేశ్వరరావు, గుళ్లపల్లి దుర్గయ్య, వెంకటేశ్వరావు, అబ్బినేని రంగబాబు, యలమర్తి నాగయ్య మరి కొందరు వారి అనుచరులతో వైఎస్సార్‌ సీపీ నాయకులు కొఠారి మోహన్, బేతిన మధు ఆధ్వర్యంలో ఆళ్ల నాని, పార్టీ సమన్వయకర్తలు కోటగిరి శ్రీధర్, ఎలీజా, అబ్బాయిచౌదరి సమక్షంలో వైఎ స్సార్‌ కాంగ్రీస్‌ పార్టీలో చేరారు.

అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతు, డ్వాక్రా రుణమాఫీలు, నిరుద్యోగభృతి, ఇంటికో ఉద్యోగం అంటూ హమీలు గుప్పించి చంద్రబా బు అందలమెక్కిన తర్వాత అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాజధాని ని ర్మాణం, అబివృద్ధి తనతోనే సాధ్యమని చెప్పి ప్రజ లను మోసం చేశారన్నారు. టీడీపీ నాయకులు దోచుకో.. దాచుకో పద్ధతిన రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్నారన్నారు. దీంతో విసుగుచెందిన ఆ పార్టీ నాయకులు వైఎస్సార్‌ సీపీ వైపు చూస్తున్నారని చెప్పారు. ముందుగా నాయకులకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఏలూరు పార్లమెంటరీ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, చింతలపూడి, దెందులూరు నియోజకవర్గాల సమన్వయర్తలు వీఆర్‌ ఎలీజా, కొఠారి అబ్బాయిచౌదరి, చింతలపూడి, లింగపాలెం మండలాల అధ్యక్షులు జగ్గవరపు జానికిరెడ్డి, ముసునూరి వెంకటేశ్వరరావు, మందలపు సాయిబాబు, మేడవరపు అశోక్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top