రోడ్డెక్కిన టీడీపీ తగాదాలు

TDP Leaders Conflicts In Visakhapatnam - Sakshi

అమృతపురం వద్ద మాజీ సర్పంచ్‌ కుమారుడిపై దాడి

తృటిలో తప్పించుకున్న టీడీపీ నేత గండి బాబ్జీ వర్గీయులు

ఎమ్మెల్యే బండారు వర్గీయులు హత్యాయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు

విశాఖపట్నం, పెందుర్తి/సబ్బవరం: పెందుర్తి మండలం చింతగట్ల తాజా మాజీ సర్పంచ్‌ గనిశెట్టి కొండమ్మ కుమారుడు గనిశెట్టి కనకరాజు, అతడి అనుచరులపై ప్రత్యర్థులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఈ దాడి నుంచి వారంతా తృటిలో త ప్పించుకున్నారు. ఆదివారం సాయంత్రం సబ్బ వరం మండలం అమృతపురం సమీపంలో నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. దాడికి గురైన వారు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత గండి బాబ్జీ అనుచరులు కాగా... తమపై దాడికి పాల్పడింది పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుచరులని బాధితులు సబ్బవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. పెందుర్తి మండలం చింతగట్లలో నివాసం ఉంటున్న గనిశె ట్టి కనకరాజు(బాబ్జీ అనుచరుడు), ఇప్పిలివానిపాలెనికి చెందిన బొట్టా సంతోష్‌కుమార్, గొంప అప్పలరాజు సహా పలువురు గ్రామానికి చెందిన వ్యక్తులు వెదుళ్లనరవ, ఎరుకునాయుడుపాలెం గ్రామాల్లో జరిగిన పంక్షన్లకు ఆదివారం మధ్యాహ్నం వెళ్లారు.

తిరిగి కనకరాజు, సంతోష్, అప్పలరాజు ఒకే కారులో చింతగట్ల వెళ్తున్నారు. అదే సమయంలో చింతగట్ల పంచాయితీ ఇప్పిలివానిపాలెనికి చెందిన దాసరి గణేష్‌(ఎమ్మెల్యే బండా రు అనుచరుడు దాసరి రమణ కుమారుడు), సానబోయిన సతీష్, గొంప ఎర్నికుమార్, చొప్ప గణేష్, గొంప చిన్మయకుమార్, ఇప్పిలి శివ, ఇప్పిలి కుమారస్వామి, దాసరి నరసింగరావు, మరి కొంతమంది వ్యక్తులు వారిని వెంబడిం చారు. సరిగ్గా అమృతపురం వంతెన దాటుతున్న సమయంలో కనకరాజు తదితరులు ఉన్న కారు ను అటకాయించారు. అందులోని కనకరాజు, సంతోష్‌కుమార్, అప్పలరాజులను బయటకు లాగి సామూహిక దాడికి పాల్పడ్డారు. పదునైన వస్తువులతో దాడి చేయడంతో సంతోష్‌కుమార్‌ చేతికి తీవ్రగాయమైంది. కనకరాజు, అప్పలరాజు చాకచక్యంగా దాడి నుంచి తప్పించుకున్నారు. అదే సమయంలో జనాలు గుమిగూడడంతో దాడి చేసినవారంతా అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే అక్కడి నుంచి సబ్బవ రం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న బాధితులు కనకరాజు, సంతోష్‌కుమార్, అప్పలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘటనస్థలాన్ని సందర్శించిన పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెందుర్తి పోలీసులు కూడా ఈ కేసు దర్యాప్తులో పాలుపంచు
కుంటున్నారు.

అదే కారణమా..!
టీడీపీ నేతలు గండి బాబ్జీ, బండారు సత్యనారాయణమూర్తి మధ్య చిరకాల శత్రుత్వం ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారి అనుచరులు కూడా తరచూ పరస్పరం దాడులకు దిగడం పెందుర్తి నియోజకవర్గంలో సర్వసాధారణమైపోయింది. ఇదే క్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి చింతగట్ల పంచాయితీ ఇప్పిలివానిపాలెంలో దుర్గాదేవి ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు అనుచరులైన దాస రి రమణ, దాసరి గణేష్‌ తదితరులు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. దీనిపై గ్రామస్థులు పెందుర్తి పోలీసులకు పిర్యాదు చేయడంతో కార్యక్రమాన్ని నిలిపేసి అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసింది బాబ్జీ వర్గీయులే అని బండారు వర్గీయులు భావించినట్లు తెలుస్తుంది. తాము అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసుకుంటే వారే కార్యక్రమాన్ని నిలిపి వేయించారన్న కక్షతో ఈ దాడికి దిగినట్లు సమాచారం. దీంతో పాటు గత ఐదేళ్లుగా పం చాయితీలో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు ఉన్నాయి. భూ ఆక్రమణలు, అక్ర మ క్వారీలు, ఇతరాత్రా అవినీతి వ్యవహారాల్లో ఇరువర్గాలు పరస్పరం ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా ఉంది.మరోవైపు తనకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయమూర్తి అనుచరులతో ప్రాణహాని ఉందని, దీనిపై నగర, జిల్లా పోలీసుల ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తానని గనిశెట్టి కనకరాజు పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top