ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్‌ అవసరం

tammineni commented over trs - Sakshi

సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పాలన ప్రజలకే మాత్రం అనుకూలంగా లేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడ తాయని ఆశించిన ప్రజల ఆశలు అడియాస లయ్యాయని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యా మ్నాయ రాజకీయ ఫ్రంట్‌ ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం వివిధ ప్రజా సంఘాలతో జరిగిన సన్నాహక సమావేశం లో ఆయన మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించేలా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్‌ ఏర్పాటు కావాల్సి ఉందని, రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ ఫ్రంట్‌ ముందు కెళ్లాలని అభిప్రాయ పడ్డారు. 119 నియోజక వర్గాల్లో పోటీచేసేలా ప్రయత్నం చేయాలని, జనవరి నెలమొత్తం పెద్దఎత్తున ప్రచార జాతలు, ఆందోళన లు నిర్వహించాలని పిలుపు ఇచ్చారు. రాజకీయ ఫ్రంట్‌ నిర్మాణంపై సీపీఐ, బీఎస్పీలతో చర్చలు జరుగుతున్నాయన్నారు.

కాంగ్రెస్‌ విధానాల ఫలితంగానే రాష్ట్రం వెనుకబాటుకు గురైం దని, పేదల బతుకుల్లో ఏ మార్పు రాలేదని తమ్మినేని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఐక్య ఫ్రంట్‌ ఏర్పాటు కావాలని, గుజరాత్‌ ఎన్నికల ఫలితాలను బట్టి బీజేపీ భవిష్యత్‌ ఆధారపడి ఉందని ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లో బీజేపీ గెలిస్తే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

Back to Top