తలైవా చూపు బీజేపీ వైపు..?

Super Star Rajinikanth Looking To Join In BJP - Sakshi

సాక్షి, చెన్నై: 2021 ఎన్నికల్లో తమిళనాడు చిత్రపటం మారనుందా? శాసనసభ ఎన్నికలు  సుమారు మరో రెండేళ్లు ఉండగానే ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంటోంది. కారణం నటుడు రజనీకాంత్‌నే. ఈయన రాజకీయ రంగప్రవేశం గురించి రెండు దశాబ్దాలకు పైగానే నలుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదుగో,అదుగో అంటూ కాలయాపన చేస్తున్నారే గానీ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావడానికి ధైర్యం చేయలేకపోతున్నారనే వాదన ఉంది. ఇక ఎట్టకేలకు గత ఏడాదిలో రాజకీయాల్లోకి వస్తున్నానని బహిరంగంగా ప్రకటించారు. అంతే కాదు అందుకు తన అభిమానులను సన్నద్ధం చేశారు. వారు రజనీ ప్రజా సంఘం పేరుతో సభ్యుల నమోదు, కార్య నిర్వాహకులు,బూత్‌కమీటీలు అంటూ హంగామా చేశారు. దీంతో గ త పార్లమెంట్‌ ఎన్నికల్లో రజనీకాంత్‌ పార్టీ పెట్టి పోటీ చేస్తారని చాలా మంది భావించారు. అలాంటిది శాసన సభ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకున్న రజనీ పార్లమెంట్‌ ఎన్నికలకుక దూ రంగా ఉన్నారు. దీంతో ఆయన అభిమానుల్లో రజనీకాంత్‌ రాజకీయరంగప్రవేశంపై మరోసారి సందేహం తలెత్తింది. అందుకు కారణం ఆయన వరుసగా చిత్రాలను చేసుకుంటూ పోవడం కూడా.

బీజేపీపై ప్రేమ
కాగా మరోపక్క రజనీకాంత్‌ మొదటి నుంచి భారతీయ జనతా పార్టీకు మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ముందు నరేంద్రమోది బలవంతుడని అని పేర్కొన్నారు. రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలకనుగుణంగానే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగ్రించింది. సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్రమోడికి రజనీకాంత్‌« శుభాకాంక్షలు తెలిపారు.పార్లమెంట్‌ ఎన్నికల ముందు వరకూ  బీజేపీ గెలు స్తుందా? కాంగ్రేస్‌ కూటమి గెలుస్తుందా? అన్న చిన్న సందేహంతో ఉన్న రజనీకాంత్‌ ఎన్నికలనంతరం ఫలితాలతో పూర్తిగా బీజీపీ మద్దతుదారుడిగా మారినట్లు రాజకీయ విజ్ఞులు భావించారు. వారి భావనను బలపరిచే విధంగా కశ్మీర్‌ వ్యవహారంతో 370 రద్దు వంటి  కేంద్రప్రభుత్వ చర్యలను సమర్ధించడంతో పాటు, మోడి ప్రభు త్వ ధైరంగా పేర్కొన్నారు. ఇక సోమవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న  కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో పాటు రజనీ కాంత్‌ పాల్గొని మోడీ,అమిత్‌షాలను కృష్ణార్జులుగా పేర్కొంటూ ప్రశంసల వర్షం కురించారు.

బీజేపీతో కూటమి?
ఇవన్నీ చూస్తున్న రాజకీయ కోవిదులు,సాధారణ ప్రజలు కూడా రజనీ చూపు బీజేపీ వైపు పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజీపీ, అన్నాడీఎంకే పార్టీలో కూటమి పెట్టుకుని పోటీ చేయాలన్నది తలూవా వ్యూహంలా కనిపిస్తోందని ప్రచారం జోరందుకుంది. బీజేపీకి కూడా తమిళనాడులో కాలు మోపాలనే ఆకాంక్ష చాలా కాలంగా బలనీయంగా ఉంది. అయితే  ఇక్కడ ఒంటరిగా పోటీ చేసే పరిస్ధితి లేదు. అంతే కాదు గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పాలకప్రభుత్వం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నా ఒక్క లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోలేకపోయ్యింది.దీంతో  రానున్న శాసనసభ ఎన్నికల్లోనైనా అన్నాడీఎంకే.రజనీకాంత్‌లతో పొత్తు పెట్టుకుని గెలవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

కమల్‌తో ఢీనేనా?
ఇలా రజనీకాంత్‌ బీజేపీ వైపు చూస్తుంటే శాసనసభ ఎన్నికల్లో ఆయన చిరకాల మిత్రుడు కమలహాసన్‌తో డీ కొనక తప్పాదా? ఎందుకుంటే మక్కళ్‌నీదిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ ఆది నుంచి అన్నాడీఎంకే,బీజీపీ పార్టీలకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు.ఇకకశ్మీర్‌ వ్యవహారంలోనూ బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టారు. అయితే రజనీకాంత్‌తో కూటమికి  సిద్ధం అనే సంకేతాలు  చాలా సార్లు పంపారు. అలాంటిది ఇప్పుడు ర జనీకాంత్‌ బీజేపీ,అన్నాడీఎంకే పార్టీలతో పోత్తు పెట్టుకుంటే కమలహాసన్‌ ఆయనతో డీ కొనక తప్పదు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో, రానున్న శాసనసభ ఎన్నికలనంతరం తమిళనాడు చిత్ర పట్టం ఎలా మారుతుందో?

రజనీపై ఆగ్రహం
ఇదిలా ఉంటే కళ్మీర్‌ వ్యవహారంలో బీజీపీని సమర్ధించిన రజనీకాంత్‌పై నామ్‌ తమిళర్‌ పార్టీ నేత సీమాన్,వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌లు విమర్శల దాడికి దిగారు. తిరుమావళవన్‌ స్పంధిస్తూ రజనీకాంత్‌ వ్యాఖ్యలు ఊహించినవేనన్నారు. అయినా ఆయన అలా మాట్లాడి ఉండరాదనీ అన్నారు. ఇక సీమాన్‌ పేర్కొంటూ కృష్ణార్జులు అంటా మహాభారతంతో పోల్చుతున్నారనీ,అలాగైతే ఎవరితో పోరాటం జరుగుతోందన్నది కూడా రజనీకాంత్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంతో కాంగ్రేస్,డీఎంకే కూడా బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top