నిజాయితీ పరులైతే భయమెందుకు?

Somu Veerraju slams Chandrababu Naidu - Sakshi

కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు సాధారణంగా...యాదృచ్ఛికంగా జరుగుతున్నవే కానీ, టిడిపి మీద పనికట్టుకుని చేస్తున్నవి కావని బీజేపీ ఎమ్మెల్సే సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఐటీ దాడులు పన్నులు ఎగ్గొట్టే వారిపైనా, అవినీతి పరులుపైనా జరుగుతాయన్నారు.  ప్రత్యేకంగా చంద‍్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్న దాడులు ఎంతమాత్రం కావన్నారు.  ఐటీ దాడులను చూసి చంద్రబాబు ప్రభుత్వం విపరీతంగా భయపడిపోతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఒకవేళ వారు నిజాయితీ పరులైతే ఐటీ దాడులను చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఏసీబీ దాడులు జరుగడాన్ని ఏ రకంగా తీసుకోవాలని ఆయన ప్రశ్రించారు.  ఈ దాడులను చంద‍్రబాబు ప్రోత్సహిస్తున్నట్లా? అని వీర్రాజు నిలదీశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top