మట్టి తవ్వి తీయడానికి రూ.13 వేల కోట్ల ఖర్చా?

Somu Veerraju Slams Chandrababu In East Godavari - Sakshi

తూర్పుగోదావరి జిల్లా: నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా మట్టి తవ్వి తీయడానికి రూ.13600 కోట్లు ఖర్చు చేశారా అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..తవ్విన మట్టిని కూడా టీడీపీ నాయకులు అమ్మేసుకున్నారని విమర్శించారు. చంద్రబాబూ నిన్ను పంచభూతాలు గమనిస్తున్నాయి..జాగ్రత్త అని హెచ్చరించారు.

పాఠశాలలకు సున్నం వేయడానికి మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే..ఏకంగా రూ.120 కోట్లు మింగేశారని ఆరోపించారు. ఇదో భారీ కుంభకోణమని వ్యాఖ్యానించారు. స్కూలు యూనిఫారాల టెండర్‌ రూ.250 కోట్లకు మరో వ్యక్తికి కట్టబెట్టారు..ఇదో కుంభకోణం అని అవినీతి ఆరోపణలు గుప్పించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top