ఆ డబ్బాల్లో రూ. కోటి

Revanth reddy controversial comments on trs meeting - Sakshi

తెలంగాణ భవన్‌లో ఒక్కరోజే రూ.100 కోట్లు పంచారు

టీఆర్‌ఎస్‌ సమావేశంపై ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్‌ సమావేశంపై కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రగతి నివేదన సభ సామగ్రి పేరిట ఒక్కో ఎమ్మెల్యే కు ఇచ్చిన డబ్బాల్లో రూ.కోటి రూపాయలు పెట్టి ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఒక్క రోజే రూ.100 కోట్లు పంచినట్లు సమాచారం ఉంద న్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరు లతో మాట్లాడుతూ.. కొందరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే తనతో ఈ విషయం చెప్పారని, నిఘా సంస్థలు తక్షణమే దీనిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.  

సుమోటోగా తీసుకోవాలి: షబ్బీర్‌ అలీ
ముందస్తు ఎన్నికలంటూ కేసీఆర్‌ టైంపాస్‌ చేస్తున్నారని మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ఒకొక్కరికి రూ.10 కోట్లిస్తామ ని కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ నేతలతో చెప్పిన విషయాన్ని ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top