‘ఎన్టీఆర్, బాబులకు వచ్చిన ఫలితమే పునరావృతం’ 

Revanth Reddy Comments on Early Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కారణంగా 1989లో ఎన్టీఆర్, 2004లో చంద్రబాబులకు వచ్చిన ఫలితమే ఇప్పుడు కూడా పునరావృతమవుతుందని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలే తమ బాస్‌లని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు ఐదేళ్లు పాలించాలని ప్రజలు ఓట్లేస్తే 4 ఏళ్ల 4 నెలలకే ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారో చెప్పాలన్నారు.

సోమవారం సీఎల్పీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ,  విభజన హామీల కోసం ఏనాడూ ప్రధాని వద్దకు వెళ్లని కేసీఆర్, ఇప్పుడు ముందస్తు ఎన్నికల కోసం మోదీ ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ అంటున్న బీజేపీ.. కేసీఆర్‌ ప్రతిపాదించిన ముందస్తు ఎన్నికలకు ఎలా సహకరిస్తుందని ప్రశ్నించారు. ప్రగతి నివేదన సభకు 25 లక్షల మందిని తీసుకురావాలంటే రూ.500 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో సభ ఇన్‌చార్జి, మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు.  

Advertisement
Advertisement
Back to Top