‘గులాబీ’ చీడను తొలగించాలి: రేవంత్‌రెడ్డి

Revanth reddy commented over kcr - Sakshi

దేవరకొండ: తెలంగాణ ఉద్య మకారులకు బుక్కెడు బువ్వ పెట్టనివాడు.. బంగారు తెలంగాణ ఎలా తెస్తాడని కాంగ్రెస్‌  నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌నుద్దేశించి అన్నా రు. గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండలో   పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఉద్యమకారుడని చెప్పుకుంటున్న కేసీఆర్‌పై ఎన్నికేసులు ఉన్నాయో చెప్పాలన్నారు.

రాష్ట్రానికి పట్టిన ‘గులాబీ’చీడను తొలగించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌నేతలు, కార్యకర్తలపై ఉందన్నారు. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇచ్చిన దాఖలాల్లేవని, తన కుటుంబం కోసం 12 ఎకరాల్లో బంగ్లా నిర్మించుకున్నారని ఆరోపించారు. ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్ల పెంపు ఏమైందని రేవంత్‌ ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top