జితిన్‌కు రెండు ఆప్షన్లు!

Rahul Gandhi offers Lucknow ticket to Jitin Prasada - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జితిన్‌ ప్రసాదను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయనకు రెండు అవకాశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు జితిన్‌ ప్రసాద సన్నాహాలు చేసుకుంటున్నారని వార్తలు రావడంతో రాహుల్‌ అప్రమత్తమయ్యారు. జితిన్‌ను పార్టీ వీడకుండా చూసేందుకు రెండు ఆపన్షన్లు ఇచ్చారని సమాచారం.

లక్నో లోక్‌సభ స్థానాన్ని కేటాయిస్తామని ఆయనకు రాహుల్‌ హామీ ఇచ్చారట. ఎన్నికల్లో ఓడిపోతే రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే కేటాయించిన దౌరహ్రా నియోజవర్గం నుంచి పోటీలో కొనసాగాలని రెండో ఆప్షన్‌ ఇచ్చినట్టు తెలిపాయి. అయితే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు జితిన్‌ ప్రసాద ఇష్టపడటం​ లేదు. లక్నో లేదా సీతాపూర్‌ నుంచి బరిలోకి దిగేందుకు ఆయన సముఖత చూపుతున్నారు. లక్నోలో బీజేపీ అభ్యర్థిగా హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పోటీలో ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top