భారత్‌ మళ్లీ గెలిచింది : మోదీ

PM Modi Tweets This Is India Win Over Election Results - Sakshi

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో మూడు లక్షల అరవై వేలకు పైగా మెజారిటీతో అఖండ విజయం సాధించారు. అదే విధంగా స్పష్టమైన మెజారిటీతో బీజేపీ గెలుపు దిశగా దూసుకువెళ్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు నిజం చేస్తూ ఎన్నికల తుది ఫలితాలు వెలువడుతున్న తరుణంలో.. ఎన్డీయే విజయాన్ని భారత్‌ విజయంగా ఆయన అభివర్ణించారు.

ఈ మేరకు..‘ సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌.. విజయీ భారత్‌... మనమంతా కలిసే ఎదిగాం. మనమంతా కలిసే భారత్‌ను నిర్మించాం. ఇది భారత విజయం’ అని ఆయన ట్వీట్‌ చేశారు. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారం చేపట్టనున్న నేపథ్యంలో శ్రీలంక ప్రధాని విక్రమ్‌ రణసింగే, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తదితరులు ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top