ఆత్మీయత పంచిన ఆత్రేయపురం

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

పూతరేకు రుచి చూపించిన అక్కచెల్లెమ్మలు

వైఎస్‌ జగన్‌ను పూలదారుల్లో నడిపించిన ప్రజలు

సన్నాయి వాయిద్యాలతో సంప్రదాయ స్వాగతాలు

పాదయాత్ర గ్రామాల్లో పండుగ వాతావరణం

జన సందోహంతో కిక్కిరిసిన ఆత్రేయపురం సెంటర్‌

మూడో రోజు 12.2 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర

సాక్షి, తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం: రాజన్న బిడ్డ తమ గ్రామాలకు రావడంతో ఆత్రేయపురం మండల ప్రజలు మురిసిపోయారు. పూతరేకులు తినిపించి ఆత్మీయత పంచారు. తమ గ్రామాలకు వచ్చినప్పుడు పొలిమేరలో మేళతాళాలతో సంప్రదాయ స్వాగతం పలికి పూలదారుల్లో నడిపించారు. జగన్‌ రాకతో ఆత్రేయపురం మండల గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. బాణసంచా పేలుళ్లతో పల్లెలు తిరునాళ్లను తలపించాయి. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 189వ రోజు జిల్లాలో మూడో రోజు గురువారం 12.2 కిలోమీటర్ల మేర సాగింది. బుధవారం రాత్రి బస చేసిన ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామం నుంచి ఉదయం 8:45 గంటలకు బయలుదేరిన పాదయాత్ర వెలిచేరు, వద్దిపర్రు క్రాస్, పులిదిండి మీదుగా సాగింది. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం అనంతరం 3:30 గంటలకు తిరిగి ప్రారంభమైంది. ఉచ్చిలి మీదుగా ఆత్రేయపురం రాత్రి బస ప్రాంతానికి సాయంత్రం 6 గంటలకు చేరుకుంది.

అడుగడుగునా అభిమాన జడివాన..
పేరవరం, వెలిచేరు, వద్దిపర్రు క్రాస్, పులిదిండి, ఆత్రేయపురం గ్రామాల్లోని ప్రజలు రహదారిపై పూలు చల్లి తమ నేతను నడిపించి అభిమానాన్ని చాటుకున్నారు. పేరవరంలో అభిమానులు వరికంకులతో తయారు చేసిన గుచ్ఛాన్ని అందజేశారు. పేరవరం గ్రామానికి చెందిన మంగా దివ్య అనే బాలిక.. జననేతకు బొబ్బట్లు తినిపించి అభిమానాన్ని చాటుకుంది. పుచ్చకాయల కిషోర్‌–శిరీష దంపతులు తమ కుమార్తెకు వైఎస్‌ జగన్‌తో నామకరణం చేయించుకున్నారు. ఆ చిట్టితల్లికి జన నేత జగన్‌ ‘విజయమ్మ’ అని నామకరణం చేశారు. వెలిచేరులో అభిమానులు వైఎస్‌ జగన్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. వద్దిపర్రు క్రాస్‌ వద్ద రైతులు నాగలిని బహూకరించి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఆత్రేయపురంలో వైఎస్‌ జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కచెల్లెమ్మలు హారతులిచ్చి దిష్టి తీశారు. జననేతను చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. సెంటర్‌లో అక్కచెల్లెమ్మలు వైఎస్‌ జగన్‌కు పూతరేకులు తినిపించగా.. ఆయన బాగుందని కితాబిచ్చారు. పూతరేకుల తయారీ గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. పేరవరం నుంచి లొల్ల లాకుల వరకు బొబ్బర్లంకకు చెందిన దళితులు తమ నావలపై వైఎస్సార్, వైఎస్‌ జగన్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, నవరత్నాల పథకాల కటౌట్లతో మధ్య డెల్టా కాలువ నుంచి యాత్రను అనుకరించారు. ఓ పక్క మధ్య డెల్టా కాలువ, మరోపక్క పచ్చని అరటి, కొబ్బరి తోటల మధ్య కాలువ గట్టుపై ప్రజా  సంకల్పయాత్ర ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది.

సమస్యలు.. వినతులు..
పాదయాత్ర పొడవునా పలువురు తమ సమస్యలను జననేతకు చెప్పుకున్నారు. పేరవరం గ్రామానికి చెందిన జి.సుజాత తన కుమారుడు శివరామసాయి పుట్టి మూగవాడని, ఆపరేషన్‌ చేస్తే మాటలు వస్తాయని డాకర్లు చెప్పారని, ఆదుకోవాలంటూ విన్నవించింది. గత ఎన్నికల్లో తన కుమారుడు వరదా కొండలరావు వైఎస్సార్‌ సీపీ గెలుపునకు పనిచేయడంతో చంపేశారని, తాము లేకుండానే పోస్టుమార్టం చేసి, ఇప్పటి వరకు మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని వరదా సత్యవతి వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఇలా పాదయాత్ర పొడవునా ప్రజలు.. వైద్యం, పింఛను, ఇళ్ల స్థలాల కోసం, సీపీఎస్‌ ఉద్యోగులు, అంగన్‌వాడీలు, యానిమేటర్లు, కల్లుగీత కార్మికులు, దింపుడు కార్మికులు, రైతులు, అరటి రైతులు, విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు తమ సమస్యలను జననేతకు చెప్పుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న వైఎస్‌ జగన్‌ పరిష్కారంపై భరోసా ఇస్తూ ముందుకు సాగారు.

పాదయాత్రలో పార్టీ నేతలు...
పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ వెంట స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌చందర్, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగపండు ఉష, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం ముఖ్యనేత జక్కంపూడి గణేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పినిపే విశ్వరూప్, కాకినాడ, అమలాపురం పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పాముల రాజేశ్వరీదేవీ, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వేగుళ్ల లీలాకృష్ణ, అనంత ఉదయ్‌భాస్కర్, తోట సుబ్బారావునాయుడు, శ్రీకాకుళం నాయకురాలు రెడ్డి శాంతి, జెడ్పీ ప్రతి పక్ష నేత సాకా ప్రసన్నకుమార్, జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ యనమదల మురళీకృష్ణ, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి విప్పర్తి వేణుగోపాల్, పార్టీ నేత వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి కొవ్వూరు త్రినాథ్‌రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కర్రినాగిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు మార్గాని గంగాధర్‌రావు, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, తమ్మన శ్రీను, చిలువూరి బాబిరాజు, జెడ్పీటీసీ మద్దూరి సుబ్బలక్ష్మి, కేవీజీ కృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్‌ బొంతా శ్రీహరి, పార్టీ యువజన విభాగం నేత పిల్లి సిరిబాల తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు

13-12-2018
Dec 13, 2018, 08:13 IST
శ్రీకాకుళం :పేదల సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదని పలువురు బాధితులు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు....
13-12-2018
Dec 13, 2018, 08:02 IST
శ్రీకాకుళం అర్బన్‌: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కళింగ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కళింగసీమ సేవాసమితి ప్రతినిధులు ప్రతిపక్షనేత...
13-12-2018
Dec 13, 2018, 07:58 IST
శ్రీకాకుళం :టీడీపీ హయాంలో కళాకారులకు గుర్తింపు కరువైంది. నేను మృదంగం విభాగంలో ఐదుసార్లు జాతీయ అవార్డు పొందాను. మహానేత వైఎస్‌...
13-12-2018
Dec 13, 2018, 07:55 IST
శ్రీకాకుళం :ఆమదాలవలస మున్సిపాలిటీకి మూడు కిలోమీటర్లు దూరంలో మా గ్రామం సొట్టవానిపేట ఉంది. మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందిపడుతున్నాం. తాగునీరు...
13-12-2018
Dec 13, 2018, 07:51 IST
శ్రీకాకుళం ,ఎల్‌.ఎన్‌.పేట: తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సత్తా, చరిత్ర ఎటువంటిదో తెలుగు ప్రజలకు తెలిసిపోయిందని వైఎస్సార్‌...
13-12-2018
Dec 13, 2018, 07:49 IST
శ్రీకాకుళం ,అరసవల్లి: జన క్షేమమే ధ్యేయంగా, విశ్వసనీయతే ఆయుధంగా సాగుతున్న ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. రాజన్న బిడ్డ...
13-12-2018
Dec 13, 2018, 07:46 IST
శ్రీకాకుళం :‘నా భర్త పెళ్లి అయిన ఆరేళ్లకే చని పోయాడు. అప్పటి నుంచి కాయకష్టంతో నా కొడుకు అప్పలనాయుడును ఎమ్మెస్సీ...
13-12-2018
Dec 13, 2018, 07:44 IST
శ్రీకాకుళం :‘గ్రామీణ మధ్య తరగతి విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువులకు దూరమవుతున్నారు’ అని ఆమదాలవలస సాగర్‌ డిగ్రీ కాలేజీకి చెందిన...
13-12-2018
Dec 13, 2018, 07:38 IST
శ్రీకాకుళం :‘అన్నా.. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించాలి. విశాఖపట్నంలో 2015లో జరిగిన యువభేరిలో కూడా మీకు వివరించాం.’ అని ఏయూ...
13-12-2018
Dec 13, 2018, 07:36 IST
శ్రీకాకుళం అర్బన్‌: జిల్లాలో మరో కీలక సామాజిక వర్గానికి జగన్‌ వరాల జల్లు కురిపించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్‌...
13-12-2018
Dec 13, 2018, 07:33 IST
శ్రీకాకుళం :‘ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా చట్టం చేయండి’ అని ఆమదాలవలస మండలం కె.మునగవలస ఎంపీటీసీ...
13-12-2018
Dec 13, 2018, 07:31 IST
శ్రీకాకుళం :‘అన్నా.. నేను ఒక్క కుమార్తెతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నాను. అప్పట్లో ఆడపిల్ల సంరక్షణ పథకం కింద బాండు...
13-12-2018
Dec 13, 2018, 04:12 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కళింగ కోమట్ల(వైశ్యులు)కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తామని...
13-12-2018
Dec 13, 2018, 03:50 IST
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,441.9 కిలోమీటర్లు 12–12–2018, బుధవారం, నక్కపేట క్రాస్, శ్రీకాకుళం జిల్లా  డ్వాక్రా అక్కచెల్లెమ్మలను డిఫాల్టర్లుగా మార్చింది మీరు కాదా బాబూ? శిథిలమైన ఒక...
12-12-2018
Dec 12, 2018, 21:08 IST
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌...
12-12-2018
Dec 12, 2018, 16:52 IST
ఏపీలో ప్రజలు చంద్రబాబుపై ఆగ్రహంగా..
12-12-2018
Dec 12, 2018, 09:01 IST
సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం...
12-12-2018
Dec 12, 2018, 08:18 IST
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ కోట్ల రూపాయలు అవినీతి చేసి దొంగగా దొరికిపోతాననే...
12-12-2018
Dec 12, 2018, 08:09 IST
అన్ని అర్హతలు ఉన్నా సంక్షేమ పథకాలు అందడం లేదంటూ బాధితులంతా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. ఎన్నిసార్లు...
12-12-2018
Dec 12, 2018, 08:07 IST
శ్రీకాకుళం అర్బన్‌: ఆమదాలవలస నియోజకవర్గంలో మూసివేసిన చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని పరివర్తన్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతాడ రవికుమార్, ట్రస్ట్‌...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top