ఒకటే లక్ష్యం..ఒకటే గమ్యం!

People Support To Ys Jagan In Praja sankalpa yatra - Sakshi

జననేత ఎదుట పేదలు,  ఉద్యోగుల ఆవేదనలు

40 ఏళ్లగా నివాసముంటున్నా పట్టా ఇవ్వలేదన్న పేదలు

కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు లేక   ఆకలికేకలని విచారం

గురుకుల అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి

నెలవారీ జీతాల్లో కోత పెట్టి దగా   చేస్తున్నారన్న మహిళా ఉద్యోగులు

అందరికీ అండగా ఉంటానని జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా

151 వ రోజు ప్రజా సంకల్ప యాత్రకు జననీరాజనం

వేల కిలోమీటర్లు నడుస్తున్నా..లక్షల అడుగులు వేస్తున్నా...చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం..పట్టు సడలని ధృడ సంకల్పం...అవ్వాతాతల మోములో నవ్వులు చూడాలనిఅక్కాచెల్లెళ్ల బతుకుల్లో ఆనందం వెల్లివిరియాలని అన్నాతమ్ముళ్ల లోగిళ్లలో వెలుగు పూలు పూయాలని అన్నదాతల ఇళ్లు పాడిపంటలతో తులతూగాలనికార్మికుల కుటుంబాలు సంతోషాలతో తొణికిసలాడాలనిపల్లెలు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలు కావాలనిపట్టణాలు ప్రగతి రథ చక్రాల్లా పరుగుతీయాలనిఅంతటా అభివృద్ధి కాంతులు పరచుకునిరేపటి స్వర్ణ యుగానికి మేలిమలుపు కావాలని..రాజన్న బిడ్డ ముందుకు సాగుతున్నారు..

సాక్షి, అమరావతిబ్యూరో : నాలుగునెలలుగా  వేతనాలు లేక అప్పుల పాలవుతున్నామన్న ఆ మహిళా ఉద్యోగులను  చూసి జననేత వైఎస్‌ జగన్‌ చలించారు..గత 40 ఏళ్లగా నివాసముంటున్నా పట్టా ఇవ్వలేదన్న ఓ అక్క ఆవేదనకు బాధ పడ్డాడు. ఇళ్ల మధ్య పురుగులు జోరుతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని, చదువుకోవాలంటే కష్టంగా ఉందన్న చిన్నారుల ఆవేదకు తల్లడిల్లారు. గురుకుల పాఠశాల అ«ధ్యాపకులకు ఉద్యోగ భద్రత కరువైందని , కనీస వేతనాలు కూడా ఇవ్వలేదన్న ఆవేదనకు భరోసా కల్పించారు. దర్జీ వృత్తితో కుటుంబపోషణ కష్టంగా ఉందన్న దర్జీల వేడుకోలుకు నేనున్నానంటూ భుజం తట్టారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు సమస్యలకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలన్న వారి కోరికను తీర్చుతానంటూ హామీ ఇచ్చారు  ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు కాక అల్లాడుతున్న పేదల కష్టం చూసి చలించిపోయారు. ఇలా అందరికీ భవితపై భరోసానిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత  వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రను నిర్వహించారు.

ఉరకలెత్తిన ఉత్సాహం...
151వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన మచిలీపట్నం నియోజకవర్గంలో  బుధవారం  పాదయాత్ర నిర్వహించారు.  వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మచిలీపట్నం లో  తాను బస చేసిన శిబిరం నుంచి  ఉదయం 8.35 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి మచిలీపట్నం పట్టణంలోని  చిలకలపూడి, సర్కార్‌ నగర్,  శ్రీనివాసనగర్, పోతిరెడ్డిపాలెం, పోట్లపాలెం  వరకు పాదయాత్ర నిర్వహించారు.  పోతిరెడ్డిపాలెం వద్ద విశ్వబ్రాహ్మణులతో జరిగిన ముఖాముఖీలో వై ఎస్‌ జగన్‌ విశ్వబ్రాహ్మణలకు ఎంఎల్‌సీతో పాటు వారి అభ్యున్నతికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానన్న హామీ ఆనందం నింపింది. స్వర్ణకారులకు  పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా దివంగత నేత వైఎస్సార్‌ ఇచ్చినా జీవో నెంబర్‌ 272ను తాము అధికారంలోకి వస్తే తిరిగి ఆ జీవో విడుదల ఇస్తామని ఆయన ఇచ్చిన హామీపై వారిలో  ఉత్సాహం ఉరకలెత్తింది.

జీతాలు ఇవ్వడం లేదన్నా..
కాంట్రాక్టు బేసిక్‌తో ఎంటీఎస్‌ అధ్యాపకులుగా కొన్నేళ్లుగా పనిచేస్తున్నామని, అయితే గత నాలుగు నెలలుగా వేతనాలుతో పాటు పీఆర్‌సీ, డీఏలు రావటం లేదని మచిలీపట్నం ప్రాంతానికి చెందిన సాయిలీల, పుష్పలతలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లల్లో  పురుగులు ఎక్కువుగా ఉండడంతో అక్కడ  ఉండలేకపోతున్నామని, చదువుకోవాలంటే కష్టంగా ఉందని  చిలకలపూడి కి చెందిన చిన్నారులు సుమంత్, ముకేష్, స్పూర్తి, అన్నపూర్ణ లు జననేతను కలిసి తమ బాధ తెలిపారు. నలభై ఏళ్లుగా నివాసం ఉంటున్నా ఇళ్లకు   పట్టా ఇవ్వటం లేదని లక్ష్మణరామపురానికి చెందిన గుడిజేసి శేషగిరిమ్మ జననేత ముందు తమ సమస్యను విన్నవించుకుంది. గురుకుల పాఠశాలల్లో పనిచేసే అద్యాపకులకు కనీస వేతనాలు కూడా ప్రభుత్వం ఇవ్వకపోగా అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని  ఆవనిగడ్డ మండలం పిట్టలలంక కు చెందిన కొడాలి ప్రవీణ్, చిరుమావిళ్ల యానాదిరావు జననేతకు తమ గోడు వెల్లబోసుకున్నారు. రెడీమెడ్‌ వ్యాపారంతో వేలాది మంది  దర్జీలకు పనిలేకుండా పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామంటూ మచిలీపట్నం పోర్టు రోడ్డుకు చెందిన జిల్లా టైలర్స్‌ సంక్షేమ సంఘం కార్యదర్శి కోనేరు వీర వెంకటేశ్వరరావుతో పాటు ఆ సంఘ సభ్యులు  ఆవేదన వ్యక్తం చేశారు. గుండె ఆఫరేషన్‌కు ప్రైవేటు ఆసుపత్రికి వెళితే ఆరోగ్య శ్రీ వర్తించదని డబ్బులు గుంజారని  చిలకలపూడికి చెందిన పావర్తి అంకమ్మ జననేత ముందు వాపోయింది. మత్స్యకారుల జీవితాలల్లో వెలుగులు నింపాలని, ఎన్జీవోల సమస్యలు పరిష్కరించాలని , తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, బిడ్డ తప్పిపోయి ఏడాదైనా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఇలా ఎందరో వినతులు, ఆవేదనలు జననేత ముందుంచారు.

జగన్‌ నిర్ణయం చరిత్రాత్మకం....
కృష్ణా జిల్లాకు దివంగత ఎన్టీ రామారావు పేరు పెడతానని వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం చారిత్రాత్మకం. ఆయన స్థాపించిన పార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఆ నిర్ణయం తీసుకోలేదంటే ఆయన మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. కానీ వైఎస్‌ జగన్‌ రాజకీయాలకు అతీతంగా, ఆయన స్వగ్రామంలో పేరు పెడతానని ప్రకటించడం గర్వించదగ్గ విషయం. దీంతో ఆ ప్రాంత ప్రజలు హర్హం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అక్రమాలకు తెగబడుతున్నారు. ఇసుక, మట్టి దోపిడీలకు పాల్పడుతున్నారు. సంక్షేమ పథకాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యుల దౌర్జాన్యాలు పెచ్చుమీరుతున్నాయి. స్వయానా సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్‌ దత్తత తీసుకున్న గ్రామంలో అభివృద్ధి పేరుతో సహజ వనరులను దోచుకుంటున్నారు. దత్తత గ్రామంలో సమస్యలు తాండవిస్తున్నాయి. ఇంత సమస్య ఉన్నా ఇటు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం దారుణం.
–కైలే అనిల్‌కుమార్, వైఎస్సార్‌ సీపీ పామర్రునియోజకవర్గ సమన్వయకర్త

పాదయాత్రలో పాల్గొన్న పార్టీ నేతలు
నియోజవకర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని)తో పాటు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, కురప ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, కళావతి, తిరువురు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, పార్టీ రాష్ట్ర నాయకులు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, సాలన్న దొర, పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, వంగవీటి రాధాకృష్ణ, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, జోగి రమేష్, కైలే అనీల్‌కుమార్, ఉప్పాల రాము, రెడ్డి శాంతి, చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  చిల్లపల్లి మోహనరావు, బీసీ సెల్‌ నాయకురాలు నన్నం సునీత, జక్కా లీలావతి,  వై.చంద్రమౌళి, బందెల డానియెల్‌ నోబుల్‌ తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ను జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటాం
కృష్ణా జిల్లాకు దివంగత ఎన్టీ రామారావు పేరు పెడతానని వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం హర్షించదగ్గ విషయం. అదీ ఎన్టీఆర్‌ స్వగ్రామంలోని నిర్వహించిన సమావేశంలో ప్రకటించడం మరింత గర్వించదగ్గ పరిణామం.  ఎన్టీఆర్‌ మాకు దేవుడితో సమానం. ఆయన మీద మాకు అంత అభిమానం ఉంది. దైవంగా కొలుస్తాం. అంతటి గొప్ప వ్యక్తి పేరును జిల్లాకు పెడితే జగన్‌ను జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటాం. ఎలాంటి రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకోకుండా ప్రకటించడం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప మనస్తత్వానికి నిదర్శనం.–శివలీల, ఎన్టీఆర్‌ మొదటి భార్య బంధువు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top