జన సంద్రం

People Support to Ys  Jagan In Praja  Sankalpa Yatra - Sakshi

ఈతేరు నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర    

మూడో రోజు పొన్నూరులో పాదయాత్ర ప్రవేశం

ఘన స్వాగతం పలికిన నేతలు, ప్రజలు             

ములుకుదురులో 1500 కి.మీ. పూర్తి చేసుకున్న యాత్ర

చింతలపూడిలో పూలతో స్వాగతం పలికిన జనం    

పొన్నూరులో పోటెత్తిన జనసంద్రం  

సాక్షి అమరాతి బ్యూరో: స్వర్ణపురి జనసంద్రంగా మారింది. 1500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేసుకుని తన ముంగిట్లోకి అడుగుపెట్టిన జననేతకు బ్రహ్మరథం పట్టింది. అభిమాన నేతను చూసేందుకు తరలివచ్చిన జనంతో పొన్నూరు రోడ్లన్నీ కిటకిట లాడాయి. పట్టణంలోని ఐలాండ్‌ సెం టర్‌లో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానంగా రైతుల సమస్యలను ప్రస్తావించారు. పొన్నూరు నియోజకవర్గంలో మొక్కజొన్న, జొన్న రైతులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. రైతన్న వద్ద సరుకు ఉన్నప్పుడు ధర తగ్గిస్తారని, పంట దళారుల వద్దకు చేరగానే రేటు పెరుగుతోందని పేర్కొన్నారు. దళారులకు సీఎం నేతృత్వం వహిస్తున్నారని విమర్శించారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంతో ఆయకట్టు చివరి భూములకు సాగు నీరు అందడంలేదని ఆందో ళన వ్యక్తంచేశారు. పొన్నూరులో గృహనిర్మాణానికి సంబంధించి అవినీతి కుంభకోణం చోటు చేసుకుం దని, పట్టణంలో ఇప్పటికీ తాగునీటి సరఫరా దారుణంగా ఉందని పేర్కొన్నారు. 70 శాతానికి పైగా గ్రామాలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దివంగత మహానేత హయాంలో కృష్ణా, గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులను చేపట్టారని గుర్తు చేశారు.

పాదయాత్ర సాగిందిలా..
బాపట్ల నియోజకవర్గంలోని ఈతేరు నుంచి మూడో రోజు ప్రజాసంకల్పయాత్ర బుధవారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైంది. చుండూరుపల్లి దాటి నండూరు అడ్డరోడ్డు వద్ద పొన్నూరు నియోజకవర్గంలోకి  ప్రవేశించింది. మాచవరం క్రాస్‌ ములుకుదురు, చింతలపూడి, పొన్నూరు ఐలాండ్‌ సెంటరు, పొన్నూరు శివారు వరకు 12 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. పొన్నూరు నియోజకవర్గం ములుకుదురులో పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ రావి, వేప మొక్కలు నాటి, కేక్‌ కట్‌ చేశారు. గుంటూరు రూరల్‌ జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు 1500 అడుగుల పార్టీ పతాకాన్ని ప్రదర్శించారు. ములుకుదురులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ములుకుదురు వద్ద గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో ప్రజలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సర్వమత ప్రార్థనలు చేపట్టారు. చుండూరుపల్లికి  చెందిన జహారాబేగం డ్వాక్రా రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేశారు. మహానేత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా తన కుమారుడు జగన్మోహన్‌రెడ్డికి రూ.3 లక్షల ఖర్చయ్యే ఆపరేషన్‌ ఉచితంగా జరిగిందని పులుగువారిపాలేనికి చెందిన పులుగు సముద్రాలరెడ్డి జననేతకు వివరించారు.

పూలబాట..
చింతలపూడి గ్రామంలో మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రూత్‌రాణి, డాక్టర్‌ రవీంద్రనా«థ్‌ ఠాగూర్‌ ఆధ్వర్యంలో మహిళలు జగన్‌కు హారతులిచ్చి స్వాగతం పలికారు. పూలబాట పరిచి తమ అభిమాన నేతను నడిపిం చారు. బాణసంచా కాల్చుతూ సంబరాలు చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర స్వగ్రామం కావడం విశేషం. దారిపొడవునా డ్వాక్రా మహిళలు, రైతులు బ్రహ్మరథం పట్టారు.

స్వాగతం పలికిన నేతలు..
గుంటూరు జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ, శాసనమండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బాపట్ల, గుంటూరు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు మోపిదేవి వెంకటరమణ, రావి వెంకటరమణ, గుంటూరు, బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్తలు లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మొహమ్మద్‌ ముస్తఫా, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్సీ గంగుల ప్రతాప్‌రెడ్డి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పొన్నూరు మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రూత్‌రాణి, డాక్టర్‌ రవీంద్రనా«థ్‌ ఠాగూర్, పొన్నూరు నేతలు చిగురుపాటి సుబ్బారావు, వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు మేకతోటి సుచరిత, హెనిక్రిస్టినా, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, వైఎస్సార్‌ సీపీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌ దేవళ్ల రేవతి, గుంటూరు రూరల్‌ జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు పాల్గొన్నారు. 

వైఎస్సార్‌ సీపీలో పలువురి చేరిక
సాక్షి, గుంటూరు: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాద యాత్ర గుంటూరు జిల్లాకు చేరుకున్న తరువాత టీడీపీ, ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు. పొన్నూరులో బుధవారం జరిగిన బహిరంగ సభలో పలువురు ముఖ్యనేతలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. కాంగ్రెస్‌పార్టీ సీని యర్‌ నాయకుడు, అంజుమన్‌ కమిటీ అధ్యక్షుడు షేక్‌ యాసిన్, టీడీపీకి చెందిన పొన్నూరు జెడ్పీటీసీ సభ్యుడు తోట శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు షేక్‌ పెద్ద గఫార్, టీడీపీ నాయకురాలు మండ్రు అనిత, జనసేన నాయకుడు పసుపులేటి శ్రీనివాసరావు, పలు గ్రామాలకు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, అనుచరులు భారీ సంఖ్యలో వైఎస్సార్‌ సీపీలో చేరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top