ప్రజల మనసు గెలిచిన నేత వైఎస్సార్‌

People Support To Ys Jagan In Praja Sankalpa Yatra - Sakshi

వైఎస్సార్‌ సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ

సాక్షి, గుంటూరు: ప్రజల మనసులు గెలిచిన ఏకైక నాయకుడు దివంగత మహానేత దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్‌ సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ కొని యాడారు. తాను అపార అనుభవం గల నాయకుడినని ముఖ్యమంత్రి చంద్రబాబు గొçప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. పొన్నూరు ఐలాండ్‌ సెంటర్‌లో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జనమంతా జగన్‌ వెంటే ఉన్నారని, ఆయన్ను సీఎం చేసే వరకు అంతా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పొన్నూరు నియోజకవర్గానికి 35 ఏళ్లపాటు ఒకే కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నా అభివృద్ధి శూన్యమని దుయ్యబట్టారు. తాగు, సాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు రూ.500 కోట్ల వరకు మట్టిని అక్రమంగా దోచుకున్నారని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ నేతలపై రౌడీషీట్‌లు తెరిపిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయితేనే పొన్నూరుకు సాగు, తాగునీటితోపాటు, ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని స్పష్టంచేశారు. స్థానిక ఎమ్మెల్యే రూ.2వేల కోట్లు విలువ చేసే సంగం డెయిరీని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.

పాదయాత్ర వైపే యావత్‌ దేశం చూపు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర బుధవారం 1500 కిలోమీటర్లు దాటిందని, యావత్‌ దేశంలోని అన్ని పార్టీలూ ఈ యాత్రవైపే చూస్తున్నాయని పార్టీ గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైన టీడీపీ కేంద్రం నుంచి తమ మంత్రులతో రాజీనామా చేయించిందన్నారు. నాయకుడు ప్రజల్లో నుంచి రావాలని, వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి పోరాడాలని, అలాంటి నాయకుడి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. జనం నుంచి వచ్చిన జగన్‌పై తమ అభిమానాన్ని చాటుతున్నారని వివరించారు. టీడీపీ దుష్టపాలనను బంగాళా ఖాతంలో కలిపే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. 

మరిన్ని వార్తలు

20-07-2018
Jul 20, 2018, 06:00 IST
సాక్షి, తూర్పుగోదావరి  ,రాజమహేంద్రవరం: జగన్‌.. ఈ పేరు యువతలో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. రాష్ట్ర భవిష్యత్‌ అయిన ప్రత్యేక హోదా...
20-07-2018
Jul 20, 2018, 05:58 IST
తూర్పుగోదావరి  ,అంబాజీపేట: వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే మేమంతా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని...
20-07-2018
Jul 20, 2018, 05:55 IST
తూర్పుగోదావరి  ,పిఠాపురం: తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నాయకుడిగా అధికారంలో ఉంటే ఇక తమ బతుకులు బాగుపడతాయని ఆశించామని...
20-07-2018
Jul 20, 2018, 05:53 IST
తూర్పుగోదావరి  : అహర్నిశలు కష్టించి పనిచేసే ఉప్పర కులస్తులను ఆదుకుని ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించాలని జిల్లా ఉప్పర సంక్షేమ సంఘ...
20-07-2018
Jul 20, 2018, 05:52 IST
తూర్పుగోదావరి : ‘‘రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందన్నా.. ప్రజలు తీవ్ర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలి’’...
20-07-2018
Jul 20, 2018, 05:50 IST
తూర్పుగోదావరి  : విద్యుత్‌ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న మాకు కనీస వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలున్నా...
20-07-2018
Jul 20, 2018, 03:55 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ‘జగన్‌ ప్రకటించిన నవరత్నాల పథకాలు చాలా బావున్నాయి. రాష్ట్రంలోని...
20-07-2018
Jul 20, 2018, 03:48 IST
19–07–2018, గురువారం జేఎన్‌టీయూ సెంటర్‌ (కాకినాడ), తూర్పుగోదావరి జిల్లా దేవుడి మాన్యాలైనా, శ్మశానవాటికలైనా.. పచ్చ నేతల భూదాహానికి ఒకటే! ఈ రోజు కాకినాడ పట్టణంలోని...
19-07-2018
Jul 19, 2018, 11:28 IST
పిఠాపురం : కాయకష్టం చేసుకుని పైసాపైసా కూడగట్టుకుని పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం భూములు కొనుగోలు చేసుకుంటే వాటిని బలవంతంగా...
19-07-2018
Jul 19, 2018, 10:54 IST
గుండె వ్యాధిగ్రస్తులకు పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కాకినాడకు చెందిన ఏసీ టెక్నీషియన్‌ ములపర్తి సాల్మన్‌ జగన్‌ను కోరాడు. కుటుంబ...
19-07-2018
Jul 19, 2018, 10:36 IST
కాకినాడ రూరల్‌ ప్రాంతంలో వ్యవసాయ పనులు తగ్గిపోతున్నాయని, రానున్న రోజుల్లో వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతున్నాయని...
19-07-2018
Jul 19, 2018, 10:29 IST
తాను ఏడు నెలల క్రితం కిడ్నీకి ఆపరేషన్‌ చేయించుకున్నానని, పేద కుటుంబానికి చెందిన తమను ఆదుకోవాలయ్యా అంటూ వేములవాడకు చెందిన...
19-07-2018
Jul 19, 2018, 10:21 IST
వచ్చే ఎన్నికల్లో జగన్‌ సీఎం కావాలని ఆశీర్వాదాలు అందించామని చీడిగకు చెందిన వేదపండితులు బులుసు ప్రభాకర్‌శర్మ, వై.ప్రదీప్, డి.శ్రీహరిశర్మ, సి.తేజశర్మ...
19-07-2018
Jul 19, 2018, 10:12 IST
తన చేతికి గాయమైతే రూ.లక్షా ఏభై వేలు ఖర్చయ్యింది. కానీ ఆరోగ్యశ్రీలో కేవలం రూ.30 వేలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన...
19-07-2018
Jul 19, 2018, 10:03 IST
గంగనాపల్లిలో దీర్ఘకాలంగా వినియోగంలో ఉన్న దళితుల శ్మశాన స్థలాన్ని సొంత భూమిగా ఆక్రమించేస్తున్నారని, తమ గ్రామ సమస్యను జగన్‌కు విన్నవించుకున్నారు...
19-07-2018
Jul 19, 2018, 09:54 IST
ఉభయ కుశలోపరి.. ఎన్ని మనసులు గెలుచుకున్నారో.. ఎన్ని హృదయాల్లో కొలువై ఉన్నారో.. బుధవారం నాటి కాకినాడ బహిరంగ సభకు జనసాగరమే...
19-07-2018
Jul 19, 2018, 09:32 IST
పిఠాపురం : న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పలువురు న్యాయవాదులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌...
19-07-2018
Jul 19, 2018, 09:21 IST
తూర్పుగోదావరి : ప్రతి విద్యా సంవత్సరం నిర్వహించాల్సిన డీఎస్సీని ఏళ్ల తరబడి నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని నెలకో టెట్‌...
19-07-2018
Jul 19, 2018, 09:03 IST
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జననేత రాకతో స్మార్ట్‌సిటీ పోటెత్తింది. ఎగిసిపడిన కెరటాల్లా జనసందోహం వెల్లివిరిసింది. తాను నడిచిన దారుల...
19-07-2018
Jul 19, 2018, 08:23 IST
సాక్షి, కాకినాడ: అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top