రాజన్నరాజ్యం మళ్లీ తెద్దాం

people support to ys jagan in praja sankalpa yatra - Sakshi

ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి జనం సమస్యల మొర

అండగా ఉంటానని హామీ ఇస్తున్న జననేత

మహిళల ఆత్మీయ స్వాగతం

ఏడో రోజు రామాపురం వద్ద ప్రారంభం

గం.9.30 కు హాజీస్‌ పురానికి చేరుకున్న యాత్ర

ఏడో రోజు 6.4 కి.మీ. సాగిన వైఎస్‌.జగన్‌ పాదయాత్ర

వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనపేదవాడికి స్వర్ణయుగం..మాట తప్పని నైజం ఆయన సొంతంనిరుపేదల సంక్షేమానికి పెట్టనిపథకమే లేదుఆ మహానేత తనయుడిదీ అదే బాటఅనునిత్యం ఆయన నోటపేదల సంక్షేమమేఇందుకోసం నాన్న ఒకడుగు వేస్తేతాను రెండడుగులు వేస్తాననిరాజన్న రాజ్యాన్ని మళ్లీ తెద్దామనిఈ ప్రభుత్వ అవినీతికి.. అరాచకానికిఇక భరతవాక్యం పలుకుదామంటూపాదయాత్ర సాగిస్తున్న
జగన్‌మోహన్‌ రెడ్డి వెంట జనంఉత్సాహంగా అడుగులేస్తున్నారు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అభిమాన సంద్రంతో అప్రతిహతంగా సాగుతోంది. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి జనంతో కలిసి అడుగులు వేస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారిని అక్కున చేర్చుకుంటున్నారు. తాను ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అర్హులుగా ఉండి కూడా ప్రభుత్వ పథకాలు అందని పరిస్థితి గురించి బాధాతప్త హృదయంతో జగన్‌కు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ వారు అర్హుల పింఛన్లు తొలగిస్తున్నారని కొందరు, ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాలేదంటూ మరికొందరు, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని ఇంకొందరు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తెస్తున్నారు.

మన అందరి ప్రభుత్వం వస్తే సమస్యలు లేకుండా చేసే బాధ్యత నాది. ప్రతి బిడ్డను ఉన్నత చదువులు చదివించడం, అర్హులందరికీ పింఛన్లు అందించడం, డ్వాక్రా గ్రూపు మహిళలకు అండగా  ఉంటానంటూ జగన్‌ ప్రజలతో మమేకమై ప్రజాసంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు. చంద్రబాబు చేసిన మోసాల గురించి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. పొగాకు, శనగ రైతులు గిట్టుబాటు ధర లేదని, దివ్యాంగుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, జాలర్లు ఎన్నో బాధలు పడుతున్నారని, మేదరలను కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆదుకోవాలని, ఈ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ ధరలను నియంత్రించాలని వైఎస్‌.జగన్‌ను కలసి తమ సమస్యలు తెలియజేశారు.

ఏడో రోజు యాత్ర ఇలా..
ఏడో రోజు కనిగిరి నియోజకవర్గంలోని రామాపురం నుంచి ప్రారంభమైన యాత్ర గుదేవారిపాలెం, బండపాలెం మీదుగా యాత్ర 9.30 గంటలకు హాజీస్‌పురం శివారు వరకు సాగింది. గురువారం పీసీపల్లి, కనిగిరి మండలాల్లో ఏడో రోజు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 6.4 కి.మీ. మేర నడిచారు.

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి నడిచిన బాలినేని, వై.వి.సుబ్బారెడ్డి
ఏడో రోజు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌ యాదవ్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు జగన్‌తో కలిసి పాదయాత్రలో నడిచారు.  కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, వైఎం ప్రసాద్‌రెడ్డి, రంగనాయకులు రెడ్డి,  బొల్లా మాల్యాద్రి చౌదరి, దంతులూరి ప్రకాశంతో పాటు పలువురు పాల్గొన్నారు.  

వైఎస్‌.జగన్‌కు సమస్యల ఏకరువు
ఎన్ని సార్లు అర్జీలు సమర్పించినా పింఛన్లు రాకుండా, మంజూరైన పింఛన్లు సైతం అడ్డుకుంటున్నారని వెంకటేశ్వరాపురం గ్రామానికి చెందిన గుది ఆదిలక్ష్మి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద మొరపెట్టుకున్నారు.
వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీలోకి మారితే అన్ని సంక్షేమ పథకాలను అందిస్తామని లేకపోతే తొలగిస్తామని టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారని వెంకటేశ్వరాపురం గ్రామానికి చెందిన గుది తిరుపతమ్మ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయారు.
రాష్ట్రంలో బుట్టలు, చాటలు, వెదురు గంపలు అల్లుకొని జీవనం కొనసాగిస్తున్న మేదరలకు ఏ ప్రభుత్వం కూడా ఆదరణ చూపించి వారి అభివృద్ధికి సహకరించటం లేదని పామూరు మండలానికి చెందిన ఆదినారాయణ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించారు.
కాటికి కాలు చాపుతున్నా, వృద్ధురాలినైనా తనకు పింఛన్‌ మంజూరు చేయకుండా వేధిస్తున్నారని రామాపురానికి చెందిన ముప్పర్ల తిరుపతమ్మ వాపోయింది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా గురువారం రామాపురంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి తనకు పింఛన్‌ ఇప్పించాలని కోరింది.
తాను వైఎస్సార్‌ సీపీ తరఫున సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేస్తుంటే అధికార పార్టీ నేతలు మాత్రం జన్మభూమి కమిటీ ఆమోదం పేరుతో అభివృద్ధికి అడ్డుపడుతున్నారని కనిగిరి మండలం తాళ్లూరు సర్పంచ్‌ మూలే ఈశ్వరమ్మ వైఎస్‌ జగన్‌ను ప్రజా సంకల్పయాత్రలో కలిసి సమస్యను విన్నవించింది.
రామాపురం ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య తాండవిస్తున్నా టీడీపీ సర్పంచ్‌ పట్టించుకోకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని ఎస్సీ కాలనీకి చెందిన నోశిన మరియమ్మ వైఎస్‌ జగన్‌ను కోరింది.
పీసీపల్లి మండలం గుదేవారిపాలేన్ని వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోకి చేర్పించి తమ గ్రామానికి తాగు, సాగు నీరు అందించాలని గ్రామస్తులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందించి అభ్యర్ధించారు.
నడవటానికి కాళ్లు లేకపోయినా అన్న మీద అభిమానమే నన్ను అన్న దగ్గరకు చేర్చిందని ప్రజాసంకల్పయాత్రలో జగన్‌ను కలిసిన దివ్యాంగుడు రేగుల శ్రీను సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
పీసీపల్లిలో అధికార తెలుగుదేశానికి చెందిన నేతలు తన కుటుంబాన్ని వేధిస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని లక్ష్మక్కపల్లికి చెందిన బద్దెల లక్ష్మణ్‌రెడ్డి పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి తన బాధను చెప్పుకున్నాడు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top