అందరివాడ్ని..అలుపెరుగని బాటసారిని..

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి : కష్టాలతో వచ్చే వారికి కొండంత ఓదార్పు... అభిమానంతో వచ్చినవారికి వెన్నెల్లాంటి చల్లని పలకరింపు.. ఇలా జననేత అందరిలోఒకడిగా.. ప్రజలతో కలసిపోతూ జిల్లాలో ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్నారు. బుధవారం ఎంతో మందితో సెల్ఫీలు దిగుతూ వారిని ఉత్సాహ పరుస్తూ ముందుకు సాగా రు.. ఈ అలుపెరుగుని బాటసారి.

మా కుటుంబాలను ఆదుకోవాలి
పశ్చిమగోదావరి : పెదవేగి మండలం సానిగూడెం గ్రామానికి చెందిన పామాయిల్‌ దింపు కార్మికులు జగన్‌ను పాదయాత్రలో కలిసి తమకు ప్రమాద భద్రత కల్పించాలని వినతిపత్రం అందదేశారు. రోజు కూలీ రూ.300 వస్తుంది. మాకు ఏదైనా ప్రమాదం జరిగితే భద్రత లేకుండా పోయింది. చెట్లు ఎక్కినప్పుడు ప్రమాదవశాత్తు పడిపోతే ఫ్యాక్టరీ యాజమన్యం, రైతులు తమను ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయిస్తున్నారే తప్ప ఆదుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి ఆదరణ లేకుండా పోతోందని, తమకు కల్లుగీత కార్మికులు మాదిరిగా వృత్తి భద్రత, బీమా సౌకర్యం కల్పించాలని జగన్‌ను వేడుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top