పాపం పండింది

People Answer With Vote to Chandrababu naidu - Sakshi

అధికార అండదండలతో టీడీపీ నేతల ఇష్టారాజ్యం

తమ అనుచరగణానికే పెద్ద పీట

పేదల సమస్యలు గాలికి కబ్జాలు, అక్రమాలపైనే దృష్టి

అడ్డుకట్ట వేయలేకపోయిన అధినేత

ఓటుతో బుద్ధిచెప్పిన జనం

కుప్పం నుంచి శ్రీకాళహస్తి వరకు సీనియర్‌ నేతల తిరస్కృతి

ప్రజల అభీష్టాన్ని టీడీపీ పాలకులు గుర్తించలేకపోయారు. అధికార అండదండలతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించారు. పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలు గాలికొదిలేశారు. అవినీతి, అక్రమాలే అజెండాగా ముందుకెళ్లారు. అనుచరులు, బంధుగణానికి అడ్డదిడ్డంగా దోచిపెట్టారు. తమ స్వార్థప్రయోజనాల కోసం అధికారాన్నీ దుర్వినియోగం చేశారు. ఐదేళ్ల అవినీతి పాలన చూసి ప్రజలువిసిగిపోయారు. సమయం కోసం ఎదురుచూసిసార్వత్రిక ఎన్నికల్లోవిశ్వసనీయత, విలువలకే పట్టం కట్టారు.

సాక్షి, తిరుపతి: టీడీపీ ఐదేళ్లపాలనపై ప్రజలు విసిగిపోయారు. సమయం కోసం వేచిచూస్తూ సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవశం చేసుకుంది. కుప్పం మినహా మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. జిల్లాతో ముడిపడి ఉన్న మూడు పార్లమెంట్‌ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయ ఢంకా మోగించింది. కుప్పంలో కూడా మొదటి రెండు రౌండ్లలో చంద్రబాబు కంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రమౌళికే అధికంగా ఓట్లు పోలయ్యాయి. చంద్రబాబు కుప్పంలో నైతికంగా ఓటమి చెందినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సమస్యల ‘కుప్ప’ం
కుప్పం నియోజకవర్గ పరిధిలో జనం సమస్యలుముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ఉపాధి కరువై వేలాది మంది  బెంగళూరు వెళ్తున్నా వారివైపు కన్నెత్తి చూడని పరిస్థితి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా? అంటే అదీ లేదు. ఒకటి రెండు చోట్ల రోడ్లు వేసి ‘పైన పసపస.. లోన లొటలొట’ అన్న చందంగా తీర్చిదిద్దారు. ఇదిలావుంటే.. కుప్పంలో విలువైన అటవీ భూములు, ప్రభుత్వ భూములను ఆక్రమించి సొమ్ముచేసుకోవడం అక్కడివారికి విసుగుపుట్టించింది.

కంపెనీ పేరుతో దందా
కుప్పం పక్కనే ఉన్న పలమనేరులో దందాల పర్వం సాగింది. మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి పదవి కోసం పచ్చ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే పార్టీ మారినట్లు చెప్పుకొచ్చారు. మంత్రి అయ్యాక ఏదైనా అభివృద్ధి చేశారా..అంటే అదీ లేదు. తన వారికోసం అర్రులుసాచడం అక్కడివారికి కంటగింపయ్యింది. ‘కంపెనీ’ పేరుతో తన అనుచరులు కొందరు ఏకమై కాంట్రాక్ట్‌ పనులు దక్కించుకున్నారు. ‘ఎన్‌పీఆర్‌’ పేరుతో పనులు దక్కించుకుని తూతూమంత్రంగాచేసి నిధులు స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నీరు–చెట్టు పేరుతో సుమారు రూ.70 కోట్ల పనులు దక్కించుకుని జేబులు నింపుకున్నారన్న ఆరోపణలున్నాయి. పనులు చెయ్యకనే కొన్ని, నాసిరకంగా మరికొన్ని, చేసిన వాటినే మళ్లీ చేసి బిల్లులు చేసుకుని స్వాహా చేసినట్లు అధికారులే ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు చేశారు.

భూ కేటాయింపుల్లో భారీ అవినీతి
జిల్లాలో పారిశ్రామిక వేత్తలకు భారీ ఎత్తున భూములు కేటాయించారు. వీటి వెనుక భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ధర ఎకరం రూ.కోటి ఉంటే.. రూ.25 లక్షలకే కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ధరను తగ్గించి పరిశ్రామిక వేత్తలకు కట్టబెట్టి వారి నుంచి భారీ ఎత్తున కమీషన్లు పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 300 మంది పేరుతో కేటాయించిన భూములన్నీ టీడీపీ నేతలు, వారి అనుచరులు దక్కించుకున్నట్లు సమాచారం. ఇసుక, మైనింగ్‌ అక్రమ రవాణాలో అమరనాథరెడ్డి పీఏ కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అవినీతిలో ‘సీనియర్లు’
మదనపల్లి, పీలేరు, శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలోనే స్థానిక టీడీపీ నాయకులు దొమ్మలపాటి రమేష్, నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు అరాచకాలు ఎక్కువయ్యాయి. మదనపల్లిలో కోట్ల రూపాయలు విలువచేసే భూములను కాజేశారు. మాజీ సైనికుల పేర్లతో కొన్ని, వారికి కేటాయించిన భూములు మరికొన్ని ఎకరాలను టీడీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే... కబ్జా చేయడం పరిపాటిగా మారింది. ఆక్రమించుకున్న భూమిలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించి దర్జాగా అనుభవిస్తున్నారు.

ఎందెందు వెతికినా.. అవినీతిమయమే!
టీడీపీలో గ్రూపురాజకీయాలకు కొదవలేదు. పీలేరులో నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి సహకారంతో అనుచరులు భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. పీలేరు పరిధిలో సుమారు 2వేల ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లు వేసి జేబులు నింపుకున్నారు. వాటర్‌ షెడ్ల పేరుతో పనులు చెయ్యకనే చేసినట్లు బిల్లులు సృష్టించి ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విషయానికి వస్తే... సీనియరే అయినా.. నియోజక వర్గానికి చేసిందేమీ లేదు. ఆయన అనుచరులు, బంధువులకు మాత్రం పనులు చేసి పెట్టి.. ప్రజా ధనాన్ని దోచిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఏళ్ల తరబడి సమస్యలు తిష్టవేనా.. స్థానిక ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏర్పేడులో ఇసుకాసురుల కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయినా.. వారిపై చర్యలు తీసుకునే ప్రయత్నమే చెయ్యలేదు. తన కుమారుడు బొజ్జల సుధీర్‌రెడ్డి వారిని పక్కన పెట్టుకునే ప్రచారం చేశారు. విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో కమీషన్లు పుచ్చుకుని భారీగా జేబులు నింపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తిరుపతి విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు గిల్లుడు అధికమైంది. వెంకటరమణ ఉన్న సమయంలోనే కోట్ల రూపాయలు విలువచేసే భూములను ఆక్రమించుకున్నారు. ఆయన మరణానంతరం కూడా అల్లుడు తన అనుచరులతో తిరుపతి నగరంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. పద్మావతిపురం వద్ద కుంట పోరంబోకు భూమిని ఆక్రమించి భారీ అపార్ట్‌మెంట్‌ని నిర్మిస్తున్నారు. కాంట్రాక్ట్‌ పనులు, కార్పొరేషన్‌లో అక్రమ కట్టడాలకు అనుమతులు ఇప్పించి కమీషన్లు పుచ్చుకోవడం పరిపాటిగా మారింది. పాడిపేట, వికృతమాట, తనపల్లి సమీపంలో నిర్మించిన గృహసముదాయాల్లో ఎక్కువ నివాసాలను అనుచరులు, పార్టీ నాయకులు, బినామీ పేర్లతో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రగిరి విషయానికివస్తే టీడీపీ అభ్యర్థి అరాచకాలు అన్నీ ఇన్నీకావు. చంద్రబాబు, లోకేష్‌ సహకారంతో నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్‌చేసి అరాచకాలకు పాల్పడ్డారు. అక్రమకేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచెయ్యడం వంటి కార్యక్రమాలతో అలజడి సృష్టించారు. జిల్లాలో టీడీపీ నాయకులు చేసిన అరాచకాలు.. దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలే వారి కొంప ముంచాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

అవినీతిలో ‘సీనియర్లు’
మదనపల్లి, పీలేరు, శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలోనే స్థానిక టీడీపీ నాయకులు దొమ్మలపాటి రమేష్, నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు అరాచకాలు ఎక్కువయ్యాయి. మదనపల్లిలో కోట్ల రూపాయలు విలువచేసే భూములను కాజేశారు. మాజీ సైనికుల పేర్లతో కొన్ని, వారికి కేటాయించిన భూములు మరికొన్ని ఎకరాలను టీడీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే... కబ్జా చేయడం పరిపాటిగా మారింది. ఆక్రమించుకున్న భూమిలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించి దర్జాగా అనుభవిస్తున్నారు.

కంపెనీ పేరుతో దందా
కుప్పం పక్కనే ఉన్న పలమనేరులో దందాల పర్వం సాగింది. మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి పదవి కోసం పచ్చ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే పార్టీ మారినట్లు చెప్పుకొచ్చారు. మంత్రి అయ్యాక ఏదైనా అభివృద్ధి చేశారా..అంటే అదీ లేదు. తన వారికోసం అర్రులుసాచడం అక్కడివారికి కంటగింపయ్యింది. ‘కంపెనీ’ పేరుతో తన అనుచరులు కొందరు ఏకమై కాంట్రాక్ట్‌ పనులు దక్కించుకున్నారు. ‘ఎన్‌పీఆర్‌’ పేరుతో పనులు దక్కించుకుని తూతూమంత్రంగాచేసి నిధులు స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నీరు–చెట్టు పేరుతో సుమారు రూ.70 కోట్ల పనులు దక్కించుకుని జేబులు నింపుకున్నారన్న ఆరోపణలున్నాయి. పనులు చెయ్యకనే కొన్ని, నాసిరకంగా మరికొన్ని, చేసిన వాటినే మళ్లీ చేసి బిల్లులు చేసుకుని స్వాహా చేసినట్లు అధికారులే ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Read also in:
Back to Top