6730 ఓట్లు బీజేపీని ముంచేశాయి..

Only 6730 Votes Made BJP Not To Have Clear Majority - Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు ఇంతలా వేడెక్కడానికి కారణం ఏ ఒక్క పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడమే. అయితే, అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడానికి కారణం కేవలం 6730 ఓట్లు మాత్రమే. మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైన 113 సీట్లకు 9 స్థానాల దూరంలో బీజేపీ నిలిచిపోయింది.

కర్ణాటక ఎన్నికల ఫలితాలను ఓ సారి విశ్లేషిస్తే.. కేవలం 6730 ఓట్లు పార్టీల తలరాతలను మార్చినట్లు తెలుస్తోంది. మ్యాజిక్‌ పిగర్‌కు కావాల్సిన తొమ్మిది సీట్లతో అతి స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్‌కు బీజేపీ కోల్పోయింది. ఈ స్థానాల్లో ఆ పార్టీ గెలిచి ఉంటే 113 సీట్లు వచ్చేవి. మస్కీలో 213 ఓట్లు, హిరెకెరూర్‌లో 555 ఓట్లు, కుండ్‌గోల్‌లో 634 ఓట్లు, ఎల్లాపూర్‌లో 1,483 ఓట్లు, బదామిలో 1696 ఓట్లు, గడాగ్‌లో 1868 ఓట్లు, శృంగేరిలో 1989 ఓట్లు, అథానీలో 2331 ఓట్లు, గ్రామీణ బళ్లారీలో 2679 ఓట్ల తేడాతో బీజేపి ఓటమి చవి చూసింది. ఇలా తొమ్మిది స్థానాల్లో బీజేపీ సాధించలేకపోయిన ఓట్లను లెక్కస్తే కాంగ్రెస్‌తో దానికి ఉన్న తేడా కేవలం 6730 ఓట్లే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top