లైవ్‌అప్‌డేట్స్‌: జోరుగా నామినేషన్లు

Nominations Updates For Telangana Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవడంతో నామినేషన్ల పర్వం మొదలైంది. సోమవారం నుంచే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నప్పటికి ఆ సంఖ్య నేడు మరింత పెరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు ముహుర్తాలు చూసుకొని నామినేషన్లు వేస్తున్నారు. టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు సైతం రెబల్స్‌గా బరిలోకి దిగుతూ.. నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో...
13 అసెంబ్లీ స్థానాలకు 37 నామినేషన్లు దాఖలు.
కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్, టీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్, బిజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ తోపాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్
మానకొండూరులో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరెపల్లి మోహన్, బీజేపీ అభ్యర్థిగా గడ్డం నాగరాజు నామినేషన్

హుజురాబాద్‌లో టిఆర్ఎస్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ తరపున ఆయన సతీమణి జమున నామినేషన్
కాంగ్రెస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ఉప్పు రవీందర్, టిడిపి అభ్యర్థిగా గుర్రం వెంకటేశ్వర్లు, ఎంసిపిఐయు అభ్యర్థిగా లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా కటంగురి బుచ్చిరెడ్డి నామినేషన్లు

చొప్పదండిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా సుంకె రవిశంకర్, బీజేపీ అభ్యర్థిగా బొడిగే శోభ నామినేషన్ దాఖలు
హుస్నాబాద్‌లో టిఆర్ఎస్ అభ్యర్థిగా సతీష్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, సిపిఐ అభ్యర్థిగా చాడ వెంకట్ రెడ్డి తరఫున పార్టీ కార్యకర్తలు నామినేషన్లు

సంగారెడ్డి జిల్లాలో..
పటాన్‌చెరు నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాన్ని సమర్పించిన తెరాస అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి.
పటాన్‌చెరు నియోజకవర్గ కేంద్రంలో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి కాటా సుధారాణి
పఠాన్ చేరు నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాన్ని సమర్పించిన టీడీపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...
అశ్వారావుపేట నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థి భూక్యా ప్రసాద్ భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.
అశ్వారావుపేట నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి టిఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు నామినేషన్ వేశారు.
ఇల్లందు నియోజకవర్గ టిఆర్ఎస్ అభ్యర్థిగా కోరం కనకయ్య నామినేషన్ దాఖలు చేశారు.
పినపాక నియోజకవర్గం మహాకూటమి అభ్యర్థిగా రేగా కాంతారావు నామినేషన్ దాఖలు చేశారు.

కంటోన్మెంట్‌లో రెబల్స్‌ హోరు
కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెబల్ అభ్యర్థులుగా ఎన్ శ్రీగణేష్, మన్మోహన్‌  నామినేషన్లు దాఖలు చేశారు. కంటోన్మెంట్ టీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులుగా గంధం దయామణి, గజ్జెల నాగేష్ నామినేషన్లు వేశారు.

నామినేషన్‌ వేసిన కేసీఆర్‌..
సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ ఆర్టీవో కార్యలయంలో నామినేషన్‌ వేసారు. ముహుర్త సమయానికే ఆయన నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

కోనాయిపల్లిలో కేసీఆర్‌ పూజలు..
సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ అసెంబ్లీ స్థానానికి బుధవారం మధ్యాహ్నం 2 గంటల 34 నిమిషాలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వెంకన్న ఆలయానికి చేరుకొని.. నామినేషన్‌ పత్రాలను వెంకన్న చెంత పెట్టి పూజలు నిర్వహించారు. అక్కడే నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేసారు. మంత్రి హరీశ్‌రావుతో కలిసి కోనాయిపల్లి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు గ్రామస్థులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం సీఎం మాట్లాడుతూ.. రైతులకు అప్పులు లేని తెలంగాణే బంగారు తెలంగాణ అన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. రైతుల ఆదాయం పెరగాలని, దేశంలోనే ధనిక రైతులకు తెలంగాణే వేదికవ్వాలని ఆకాంక్షించారు. రెండేళ్లలో సిద్దిపేటలో రైలు కూత వినిపిస్తదని తెలిపారు. సిద్దిపేటలో హరీశ్‌రావు ఆశీర్వదించాల్సిందిగా పిలుపునిచ్చారు. ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకునే.. మీ మధ్యే పెరిగానని సీఎం అన్నారు. వచ్చే ఏడాది కాళేశ్వరం నీళ్లతో దేవుడి పాదాలు కడుగుతామన్నారు. ఇక్కడ పూజలు చేసే ఉద్యమానికి బయల్దేరానని తెలిపారు. మరోసారి మీ దీవెనలతోనే యుద్ధానికి పోతున్నట్లు స్పష్టం చేశారు. వంద సీట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో సీఎం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

మంత్రి హరీశ్‌రావు సైతం కేసీఆర్‌తోపాటే కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేస్తారు. అనంతరం సిద్ధిపేటలోని ఈద్గా, చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి 2 గంటల 48 నిమిషాలకు నామినేషన్‌ దాఖలు చేస్తారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో..

  • వరంగల్: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. భూపాలపల్లి నియోజక వర్గం నుంచి సిరికొండ మధుసూదనా చారి(టీఆర్ఎస్), కీర్తి రెడ్డి( బీజేపీ),  గండ్ర వెంకట రమణా రెడ్డి(కాంగ్రెస్ ఆశావహ అభ్యర్థి), ఇండిపెండెంట్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు లు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
  • పరకాల నియోజకవర్గం నుంచి చల్లా ధర్మా రెడ్డి (టీఆర్ఎస్), వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేష్ (టిఆర్ఎస్), జనగామ నుంచి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి( టిఆర్ఎస్), స్టేషన్ ఘనపూర్, తాటికొండ రాజయ్య ( టిఆర్ఎస్), వరంగల్ పశ్చిమ నుంచి దాస్యం వినయ్ భాస్కర్(టిఆర్ఎస్), నాయిని రాజేందర్ రెడ్డి(కాంగ్రేస్ రెబల్), మహబూబాద్ నుంచి బాణోత్ శంకర్ నాయక్( టిఆర్ఎస్), డోర్నకల్ నుంచి డీఎస్ రెడ్యా నాయక్( టిఆర్ఎస్), రాంచంద్ర నాయక్(కాంగ్రెస్), నర్సంపేట నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి (టిఆర్ఎస్), ములుగు నుంచి సీతక్క (కాంగ్రెస్), చందూలాల్(టిఆర్ఎస్)లు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
  • వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేశ్ నామినేషన్ కోసం తమ కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులు రూ.5,వేలను ఆ నియోజకవర్గంలోని కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన చిన్నారులు వేముల చాతుర్య, బ్రాహ్మణిలు ఇచ్చారు.

► తుంగతుర్తి టీఆర్ఎస్ అభ్యర్థిగా గ్యాదరి కిశోర్ కుమార్ నేడు నామినేషన్‌ వేయనున్నారు. ఆయన మంత్రి జగదీశ్ రెడ్డి దంపతుల ఆశీర్వాదం తీసుకుని నామినేషన్‌ వేయడానికి బయలు దేరారు.

► నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో నేడు టిఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జూపల్లి కృష్ణారావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీరం హర్ష వర్ధన్ రెడ్డి, ఓయూ జాక్ నాయకుడు వెంకటేష్‌లు కూడా నామినేషన్‌ వేయనున్నారు.

► వనపర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top