‘పాదయాత్రల కోసం గతంలో ఎవరూ అనుమతులు కోరలేదు’

No one takes permissions to the padayatra in the past - Sakshi

అగనంపూడి (గాజువాక): ‘ఇప్పటివరకు పాదయాత్ర చేసిన ఏ నాయకుడూ డీజీపీ కార్యాలయానికి అనుమతుల కోసం దరఖాస్తు చేయలేదు.. చేసినట్టు, అనుమతులు మంజూరు చేసినట్టు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు’ అని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎంతమంది పాదయాత్ర చేశారు, ఎంత మందికి అనుమతి ఇచ్చారో తెలపాలని సమాచార హక్కు చట్టం కింద అగనంపూడికి చెందిన ఆర్టీఐ ఉద్యమకారుడు పట్టా రామ అప్పారావు కోరిన వివరాలకు డీజీపీ కార్యాలయం పై విధంగా సమాధానమిచ్చింది.

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు అనుమతులు తప్పనిసరని పలువురు మంత్రులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో రామ అప్పారావు ఈ వివరాలు కోరారు. పాదయాత్రకు అనుమతుల కోసం తమకు గతంలో ఎవరూ దరఖాస్తులు పంప లేదని, తమ వద్ద అలాంటి రికార్డులు లేవని డీజీపీ కార్యాలయం సమాధానమిచ్చింది. స్థానికంగా యూనిట్‌ ఆఫీసులోనే∙దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. 

జగన్‌కే అనుమతులు ఎందుకు? 
ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాద యాత్ర చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ కూడా ఇదేమా దిరిగా పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. అనుమతులు తీసుకోవాలంటూ ఆయన విషయంలోనే ఎందుకు ద్వంద్వ నీతి ప్రదర్శి స్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవ డం కూడా నేరమేనా.. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఎవరి అనుమతి తీసుకున్నారు? చంద్రబాబుకు ఒక రూలు, జగన్‌కు ఒక రూలా.. ఇదెక్కడి న్యాయం?  
– పట్టా రామ అప్పారావు, ఆర్టీఐ ఉద్యమకారుడు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top