బతికున్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటా 

Never Quit Congress Party Says Komatireddy Venkat Reddy - Sakshi

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: బతికున్నంత వరకు తాను కాంగ్రె‹స్‌ పార్టీలోనే ఉంటానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కొన్ని మీడియా వర్గాలు మాత్రమే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం ఆయన లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 33 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న తాను.. ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి పార్టీయే కారణమని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో రెండు సార్లు ఓడిపోవడంతో ఆవేదన చెందిన రాజగోపాల్‌ రెడ్డి.. పార్టీని ప్రక్షాళన చేయాలంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారని, అయితే ఆయన ఎక్కడ కూడా పార్టీ మారుతానని చెప్పలేదని అన్నారు. తనను ఎంపీగా గెలిపించిన భువనగిరి ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని, నిమ్స్‌ను ఎయిమ్స్‌గా అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని చెప్పారు. ఇక విజయవాడ–హైదరాబాద్‌ రహదారిని 8 లేన్లుగా అభివృద్ధి చేయడం కోసం, హైదరాబాద్‌–ఏపీ నూతన రాజధానికి నూతన రైల్వే మార్గంపై గతంలో ఇచ్చిన హామీ అమలు కోసం పనిచేస్తానని అన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top