మళ్లీ నేనే వస్తా.. మోదీ

Narendra Modi Visiting Jammu Kashmir - Sakshi

కశ్మీర్‌: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం జమ్మూ కశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. జమ్మూ ప్రాంతంలో ఎయియ్స్‌కు, యూనివర్సిటీ ఆఫ్‌ లడక్‌కు పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ మాట్లాడారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం​ చేశాయని విమర్శించారు. ‘‘పలు అభివృద్ధి పథకాలకు నేను శంకుస్థాపన చేశాను. వాటిని ప్రారంభించడానికి కూడా నేనే వస్తాను. తిరిగే నేనే ప్రధానిగా బాధ్యతలు చేపడుతాను’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

లక్ష్యసిద్ధి లేని సంస్కృతిని, అవినీతి రాజకీయాలను ఈ అయిదేళ్ల పాలనలో దేశం నుంచి తరిమికొట్టామని మోదీ అన్నారు. ఆలస్యం లేకుండా బడ్జెట్‌లో చిన్న, సన్నకారు రైతులకు ప్రకటించిన సాయాన్ని వేగంగా అందజేసే ప్రక్రియ చేపడుతామని వెల్లడించారు. మొదటి విడత సాయంగా అయిదు ఎకరాల్లోపు రైతుందరికీ రూ.2వేల సాయం అందేలా కృషి చేస్తున్నామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top