కొత్త హేర్‌ స్టైల్‌లో మోదీ, అమిత్‌ షా

Narendra modi, Amit Shah appear in New Hair Style - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ హేర్‌ స్టైలిస్ట్‌ జావెద్‌ హబీబ్‌ సోమవారం నాడు భారతీయ జనతా పార్టీలో చేరడంతోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా హేర్‌ స్టైల్స్‌ హఠాత్తుగా మారిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ తలతలలాడుతున్న తన తెల్లటి జుట్టుకు జెల్‌ పూసి పాప్‌ సింగర్‌లా వెనక్కి దువ్వుకోగా, అమిత్‌ షా కూడా జెల్‌ పూసుకొని హాలీవుడ్‌ స్టార్‌లాగా కాస్తా పక్కకు నిక్కపొడుచుకున్నట్లు దువ్వారు. మీకంటే మేమేం తక్కువ, కుర్రాళ్లం! అనుకున్నారేమో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు పోటీ పడి మరీ తమ హేర్‌ స్టైల్స్‌ మార్చుకున్నారు. వారు మార్చుకోలేదు. నెటిజెన్లు మార్చారు.

దేశవ్యాప్తంగా 110 నగరాల్లో 846 హేర్, బ్యూటీ సెలూన్లు కలిగిన ప్రముఖ హేర్‌ స్టైలిస్ట్‌ జావెద్‌ హబీబ్‌ బీజేపీలో చేరారనే వార్త తెలియగానే ట్విట్టర్‌ యూజర్లు తమదైన శైలిలో స్పందించారు. బీజేపీ నేతల ఫొటోలను తీసుకొని మార్ఫింగ్‌ ద్వారా వారి హేర్‌ స్టైల్స్‌ను మార్చి వేశారు. అంతటి ప్రముఖుడు పార్టీలో చేరినప్పుడు నేతల జుట్టు స్టైల్స్‌ మారాల్సిందేగదా! అంటూ కామెంట్‌ చేశారు. పార్టీ కార్యకర్తలంతా యువకుల్లా కనిపించేందుకు జట్టుకు రంగేసుకోవాల్సిందిగా అమిత్‌ షా పిలుపునిచ్చినట్లు కూడా ట్వీట్‌ చేశారు. తమ ప్రభుత్వంలోకి వద్ధ నేతలు వద్దంటూ నరేంద్ర మోదీ పక్కన పెట్టిన ఎల్‌కే అడ్వాణీ హేర్‌ స్టైల్‌ కూడా మార్చి ఉంటే ఆయనకు భవిష్యత్‌ ఉండేదేమో! అయితే హేర్‌ స్టైల్‌ మర్చాలంటే హేర్‌ ఉండాలికదా!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top