నల్లాల ఓదేలు అనుచరుల ఆత్మహత్యాయత్నం

Nallala Odelu Activists Suicide Attempt Over Seats Allocation - Sakshi

ఎంపీ బాల్కసుమన్‌ పాల్గొన్న కార్యక్రమంలో ఘటన

కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్త

చెన్నూరు నియోజకవర్గం ఇందారంలో ఉద్రిక్తత

సాక్షి, మంచిర్యాల: చెన్నూరు ఎమ్యెల్యే టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన నల్లాల ఓదేలుకే కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఆయన అనచరులు ఆత్మహత్యాయత్నం చేశారు. జైపూర్‌ మండలం ఇందారంలో బుధవారం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ పాల్గొన్న ఓ శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ రాకను తెలుసుకున్న ఓదేలు అనుచరులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ బాల్కసుమన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో ఘట్టయ్యా అనే కార్యకర్త తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకోని నిప్పంటించుకున్నాడు. అతని పక్కనే ఉన్న మరో నలుగురికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన అక్కడున్నవారు వారి మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొని భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పోలీసులు అక్కడున్న వారిని అరెస్ట్‌ చేసి శ్రీరాంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో చెన్నూరు నియోజకవర్గాన్ని ఎంపీ బాల్కసుమన్‌కు కేటాయించారు. దీంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన నల్లాల ఓదేలు అసమ్మతి జెండా ఎగురవేశారు. సుమన్‌కు టికెట్‌ కేటాయించడాన్ని ఆయన వర్గం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తీవ్ర మనస్థాపానికి గురైన ఓదేలు తనకేమైన జరిగితే కేసీఆర్‌దే బాధ్యత అని స్వీయ నిర్భందానికి పాల్పడ్డారు. ఇక 2010 నుంచి కేసీఆర్‌ వెంట ఉంటున్న ఓదేలు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top