‘మనవడ్ని పీఎం.. ముని మనువడ్ని అధ్యక్షుడు..!’

Mudragada Padmanabham fires on AP CM - Sakshi

భీమవరం(పశ్చిమగోదావరి): సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులను రాజకీయ వారసులుగా చేసుకోవటానికి ప్రణాళికలు వేసుకుంటున్నారని కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం విమర్శంచారు. మండలంలోని కరుకువాడ బేతపూడి గ్రామంలో వంగవీటి రంగ విగ్రహాన్ని ముద్రగడ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయన కొడుకు మంత్రి కాగా. మనవడిని ప్రధానమంత్రి, మునిమనవడిని అమెరికా అధ్యక్షుడిగా చేయాలని అనుకుంటున్నారని.. అందుకే కాపుల బాధలు పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు.

ఆయనతోపాటు వైఎస్‌ఆర్‌సీపీ భీమవరం సమన్వయ కర్త గ్రంధి శ్రీనివాస్‌ ఉన్నారు. చంద్రబాబు కాపులకు అన్యాయం చేస్తున్నారని ముద్రగడ తెలిపారు. డిసెంబర్‌ 6 లోగా కాపులకు న్యాయం చేయకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన న్యాయమైన కోరికనే చంద్రబాబును అడుతున్నామని ముగ్రడగ అన్నారు.
 
గ్రంధి శ్రీనివస్‌ మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా కాపులంతా ముద్రగడకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతంర యలమంచిలి మండలం బాడవ గ్రామంలో శ్రీ కృష్ణదేవరాయలు, వంగవీటి రంగా విగ్రహాలను ముద్రగడ ఆవిష్కరించారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top