కశ్మీర్‌పై మోదీ విధానం విఫలం: మాయావతి

Modis Kashmir Policy Failure Fires Mayawati - Sakshi

శ్రీనగర్‌: లోక్‌సభతో పాటు జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కశ్మీర్‌లో భద్రతకు సైనికల బలగాలు సిద్ధంగా ఉన్నప్పటికీ శాసనసభకు ఎన్నికలకు షెడ్యూల్‌ ఎందుకు విడుదల చేయలేదని నిలదీస్తున్నాయి. ప్రభుత్వం కూలిపోయి నెలలు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించకపోగా, కశ్మీర్‌ సమస్యపై మోదీ విధానం తీవ్రంగా విఫలమైందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడంతో మరోసారి మోదీ వైఖరి స్పష్టంగా బయటపడిందని ఆమె విమర్శించారు.

భద్రతా కారణాల రీత్యా జమ్మూ కశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలను జరపడం లేదని ఈసీ ప్రకటించిన  విషయం తెలిసిందే. దీనిపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ), పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. లోక్‌సభల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు అన్ని బలగాలనూ దింపుతామంటూ హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభ, రాజ్యసభలతోపాటు ఇటీవలి అఖిలపక్ష సమావేశంలో కూడా హామీనిచ్చారనీ, ఇప్పుడేమైందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ దురుద్దేశాల కారణంగానే జమ్మూ కశ్మీర్‌ శాసనసభకు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. 1996 తర్వాత తొలిసారిగా జమ్మూ కశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలను సరైన సమయానికి నిర్వహించడం లేదని ఎన్‌సీ నేత ఒమర్‌ అబ్దుల్లా విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top