టీడీపీతో కలిసేందుకు ఇబ్బంది లేదు: భట్టి

Mallu bhatti vikramarka about tdp - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచేందుకు తమకు ఇబ్బంది లేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. టీడీపీ ఆవిర్భావం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని, అప్పటి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా రాజకీయ కూటములు ఏర్పాటవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా కూటములు, పొత్తులు సాధ్యమేనన్నారు. పొత్తుల కోసం చాలా పార్టీలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తారనే ఆలోచనతో వారి దృష్టి మరల్చేందుకు సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలని అంటున్నారని విమర్శించారు.

ఏఐసీసీ కార్యదర్శిగా వంశీచంద్‌
మహారాష్ట్ర పార్టీ ఇన్‌చార్జిగా కూడా..
సాక్షి, న్యూఢిల్లీ: కల్వకుర్తి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డిని ఏఐసీసీ కార్యదర్శి, మహారాష్ట్ర కాం గ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నియమించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వంశీచంద్‌ గతంలో పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top