టీఆర్‌ఎస్‌పై ఆ పార్టీ నేతల్లోనే నమ్మకం లేదు: కె. లక్ష్మణ్‌

Laxman fires on TRS Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌పై ప్రజలతోపాటు ఆ పార్టీ నేతల్లో సైతం నమ్మకం సన్నగిల్లిందని.. అందుకే ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు విసిగిపోయారని, వారంతా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండల టీఆర్‌ఎస్‌ నేతలు పలువురు బీజేపీలో చేరారు. అలాగే సినీ నటి సత్యచౌదరి కూడా ఆ పార్టీ లో చేరారు.

టీఆర్‌ఎస్‌ను ప్రజలు విశ్వసించడం లేదనేది ఇటీవల నిర్వహించిన ప్రగతి నివేదన సభతో తేలిపోయిందన్నారు. ప్రభుత్వం రద్దు చేసే వరకే కేసీఆర్‌కు అధికారం ఉందని.. ఆపద్ధర్మ ప్రభుత్వమా, రాష్ట్రపతి పాలన అనేది ఆయన చేతిలో లేదని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణపై పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాతో ప్రత్యేక భేటీ ఉంటుందని లక్ష్మణ్‌ వివరించారు. ప్రతి రెండు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top