కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

Kumaraswamy Comments on Anti BJP Alliance - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జేడీఎస్‌ అధినేత, కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి హస్తినలో మంతనాలు కొనసాగుతున్నాయి. మంత్రి వర్గ కూర్పుపై కాంగ్రెస్‌ అధినాయకత్వంతో చర్చించనున్నారు. ఢిల్లీలో ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న ఆయనపై పలువురు జర్నలిస్టులు ప్రశ్నల వర్షం గుప్పించారు. ఈ క్రమంలో కూటమిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘ఈ(కాంగ్రెస్‌-జేడీఎస్‌) బీజేపీ వ్యతిరేక కూటమి ఎంత బలంగా ఉండబోతుంది?’ అన్న ఓ జర్నలిస్ట్‌ ప్రశ్నకు కుమారస్వామి స్పందిస్తూ... ‘ఇప్పుడే ఏం చెప్పలేం. అది కాలమే నిర్ణయిస్తుంది. పరిస్థితులను బట్టే మేం ముందుకు సాగుతాం’ అని ఆయన పేర్కొన్నారు. ఇక మీడియాలో వస్తున్న కథనాలను ప్రస్తావిస్తూ ఇప్పటిదాకా ఎవరికీ మంత్రి పదవులను కేటాయించలేదని, కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంతో చర్చల తర్వాతే అన్ని విషయాలపై స్పష్టత ఇస్తామని ఆయన వెల్లడించారు. 

మరోవైపు ముఖ్యమంత్రి పదవిని జేడీఎస్‌కు త్యాగం నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ మంత్రి పదవులు డిమాండ్‌ చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. జేడీఎస్‌ మాత్రం 15 బెర్త్‌లకే కాంగ్రెస్‌ను పరిమితం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎవరికి ఎన్ని పదవులు దక్కుతాయనే దానిపై మరికొద్ది గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top