కేసీఆర్‌ పుట్టిన తర్వాతే మోసం పుట్టింది 

Komatireddy Venkat Reddy Comments On KCR - Sakshi

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

ఇబ్రహీంపట్నం రూరల్‌: కేసీఆర్‌ పుట్టిన తర్వాతే మోసం పుట్టిందని, ఇలాంటి మోసపూరిత ముఖ్యమంత్రిని ఉరితీసినా తప్పు లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆదిభట్ల మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. మోసపూరిత వాగ్దానాలతో కేసీఆర్‌ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తే డబ్బా ఇళ్లు అని విమర్శించిన కేసీఆర్‌.. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు ఇస్తామని చెప్పి మాటతప్పారని విమర్శించారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తాను ఐటీ మం త్రిగా ఉన్నప్పుడు టీసీఎస్, ఏరోస్పేస్, ప్యాబ్‌సిటీ, ఔటర్‌రింగ్‌ రోడ్డు, జీఎంఆర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తే.. ఇప్పటి ప్రభు త్వం ముచ్చర్లలో ఫార్మా సిటీ ఏర్పాటు చేసి ప్ర జల నెత్తిన కాలుష్యం తెచ్చి పెట్టాలని చూస్తోం దని మండిపడ్డారు. ఫార్మా భూము లతో ఐటీ మంత్రి కేటీఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని, వారి ఆగడాలకు త్వరలోనే అడ్డుకట్ట పడుతుందన్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ భవనం నిర్మాణానికి రూ.50 లక్షలు, ఫిరంగి కాలువ మరమ్మతులకు రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్లు వెంకట్‌రెడ్డి ప్రకటించారు. 59, 44, 45 సర్వే నంబర్లలోని సీలింగ్‌ భూమిని ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయి స్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top