ఉద్యమాలపై ఉక్కుపాదం

Kodandaram strike on telangana government - Sakshi

‘కొలువుల కొట్లాట’పై అనుమతి నిరాకరణకు నిరసనగా కోదండరాం దీక్ష

హైదరాబాద్‌: కొలువుల కొట్లాట సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ.. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌ తార్నాకలోని ఆయన నివాసంలో మంగళవారం మధ్యా హ్నం నిరసన దీక్ష ప్రారంభించారు. ఆయనతో పాటు వివిధ జిల్లాలకు చెందిన జేఏసీ నేతలు, విద్యార్థి జేఏసీ నాయకులు ఈ దీక్షలో పాల్గొన్నారు. కోదండరామ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ గట్టారు.

నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కొనసాగుతున్న శాంతియుత ఆందోళనను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కేసీఆర్‌ సర్కారు అవలంబిస్తున్న నిరంకుశ పాలన, నిర్బంధ విధానాలకు నిరసనగా 24 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు.  దీక్షా శిబిరాన్ని సందర్శించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు ప్రకటి స్తుందే తప్ప అవి అమలుకు నోచుకోవడం లేదన్నారు.

ఉద్యోగాల ప్రకటనతో ప్రభుత్వా నికి ముడుపులు వస్తే వెంటనే భర్తీకి ప్రకట నలు జారీ చేసేవారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందు వరుసలో నిలబడి నడిపిన విద్యార్థులను నేడు కేసీఆర్‌ ప్రభుత్వం విస్మరించిందని టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ, విద్యార్థి జేఏసీలు ఆవిర్భవించాయని, అయితే నేడు ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు.  

నేడు వర్సిటీల బంద్‌కు పిలుపు...
కొలువుల కొట్లాట సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నిరసన దీక్షకు సంఘీభావంగా బుధవారం యూనివర్సిటీల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఓయూ జేఏసీ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సి టీలు ఈ బంద్‌లో పాల్గొంటాయని, విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top