పార్టీ పెడదామా.. వద్దా?

Kodandaram new party!! - Sakshi

క్షేత్రస్థాయి పరిశీలనకు సబ్‌కమిటీ

ఈ నెలలోనే ఏర్పాటు!

జేఏసీ చైర్మన్‌ కోదండరాం యోచన

సాక్షి, హైదరాబాద్‌: టీజేఏసీ నుంచి రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక కావాలని ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో మరో ముందడుగు పడనుంది. క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర అధ్యయనానికి సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని జేఏసీ చైర్మన్‌ ఎం.కోదండరాం నిర్ణయించా రు. జేఏసీలో ముఖ్యులుగా ఉన్న ఐదారుగు రితో ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

గ్రామ, మండల స్థాయి నుంచి అన్ని వర్గాల ప్రతినిధులతో మాట్లాడి, అభిప్రాయాలను క్రోడీకరించి జేఏసీ స్టీరింగ్‌ కమిటీకి సమగ్ర నివేదిక ఇచ్చే బాధ్యతను కమిటీకి అప్పగించనున్నారు. తెలంగాణ ఏర్పాటు నేపథ్యం, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు, ప్రస్తుతం ప్రజల మనోగతం వంటివాటిపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఏయే వర్గాల్లో శూన్యత ఉందనే అంశంపైనా దృష్టి సారించనుంది.

ప్రాంతీయ రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్, జాతీయ పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీ ఏయే వర్గాలకు దూరంగా ఉన్నాయి, జేఏసీ రాజకీయ వేదిక ఏర్పాటైతే ఏయే వర్గాలు కలసి వస్తాయన్న దానిపై అభిప్రాయాలు తీసుకోనుంది. రాజకీయ పార్టీగా ఏర్పడకుండానే ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఉద్యమాలు చేయడం వల్ల నష్టమేమైనా ఉంటుందా అన్న కోణంలోనూ అధ్యయనం చేయనుంది. ఈ నెలలోనే సబ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిసింది.

నీళ్లు, నిధులపై దృష్టి..
ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, ఉద్యోగాల కల్పనలో ప్రగతిపై టీజేఏసీ దృష్టి సారించింది.  టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై జేఏసీ చేస్తున్న పోరాటాలకు రాజకీయ మద్దతు ఎలా ఉంటుం దన్న అంశంపైనా అధ్యయనం చేయనుంది. కమిటీ ఇచ్చే నివేదికను బట్టి రాజకీయ నిర్ణయం తీసుకోవాలని కోదండరాం యోచిస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top