కీ సెగ్మెంట్స్‌

Key Segments in Congress Lok Sabha Election - Sakshi

కాంగ్రెస్‌–శిరోమణి సగం సగం

 భఠిండా :పంజాబ్‌లోని 13 లోక్‌సభ నియోజకవర్గాల్లో భఠిండా ఒకటి. దీని పరిధిలో 9 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆరు సార్లు, శిరోమణి అకాలీదళ్‌ ఆరుసార్లు గెలిచాయి. నాలుగు సార్లు అకాలీదళ్, ఒకసారి కమ్యూనిస్టు పార్టీ గెలిచాయి. 2014 ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్‌ అభ్యర్థి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌పై 19,395 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.

కాన్పూర్‌
కాంగ్రెస్‌ కోటలో కమలం పాగా

ఉత్తర ప్రదేశ్‌లోని మరో కీలక నియోజకవర్గం కాన్పూర్‌. దీని పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు (గోవింద్‌ నగర్, సిసమావు, ఆర్య నగర్,  కిద్వాయ్‌ నగర్, కాన్పూర్‌ కంటోన్మెంట్‌) ఉన్నాయి. 1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ ఏడుసార్లు గెలిచిం ది. భారతీయ జనతా పార్టీ నాలుగు సార్లు విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఎస్‌ఎం బెనర్జీ వరసగా నాలుగు సార్లు (1957–71) గెలవడం విశేషం. 1989లో సీపీఎం  గెలిచింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి మురళి మనోహర్‌ జోషి కాంగ్రెస్‌ అభ్యర్థి సిర్‌ప్రకాశ్‌ జైస్వాల్‌పై 2,22,946 ఓట్ల తేడాతో గెలిచారు.

ఈశాన్య ఢిల్లీ
చెరొకటి

ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇది ఒకటి. నియోజకవర్గాల పునర్విభజన దరి మిలా 2008 నుంచి ఈ నియోజకవర్గం ఉనికిలోకి వచ్చింది. దీని పరిధిలో పది అసెంబ్లీ స్థానాలు (బురారి, తిమార్‌పూర్, సీమపురి, రోహ్‌తాస్‌ నగర్, శీలంపూర్, ఘొండా, బాబర్‌పూర్, గోకల్‌పూర్, ముస్తఫాబాద్,  కార్వాల్‌ నగర్‌) ఉన్నాయి. ఈ నియోజకవర్గానికి ఇంత వరకు రెండు సార్లు ఎన్నికలు జరగ్గా మొదటిసారి (2009) కాంగ్రెస్‌ పార్టీ, రెండోసారి (2014) బీజేపీ నెగ్గాయి. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్‌ తివారీ  ఆప్‌ అభ్యర్థి ఆనంద్‌ కుమార్‌పై 1,44,084 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.

చండీగఢ్‌
కాంగ్రెస్‌దే పైచేయి

కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఉన్న ఏకైక లోక్‌సభ నియోజకవర్గం చండీగఢ్‌. 1967 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఏడు సార్లు గెలిచింది. బీజేపీ మూడు సార్లు విజయం సాధించింది. జనతాదళ్, జనతా పార్టీ ఒక్కోసారి గెలిచాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కిరణ్‌ అనుపమ్‌ ఖేర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పవన్‌ కుమార్‌ బన్సాల్‌పై 69,642 ఓట్ల తేడాతో గెలిచారు. 1999 నుంచి బన్సాల్‌ ఇక్కడ వరసగా మూడు సార్లు గెలవడం విశేషం.

సారణ్‌
రెండే ఎన్నికలు

బిహార్‌లోని 40 లోక్‌సభ నియోజకవర్గాల్లో సారణ్‌ ఒకటి. నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా 2008లో ఇది ఏర్పాటయింది. దీని పరిధిలో ఆరు శాసన సభ నియోజకవర్గాలు (మర్‌హౌర, చాప్రా, గర్ఖా, అమ్‌నోర్, పర్సా, సోన్‌పూర్‌) ఉన్నాయి. ఇంత వరకు జరిగిన రెండు ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్‌ (2009) ఒకసారి, బీజేపీ (2014) ఒకసారి గెలిచాయి. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ ఆర్‌జేడీ అభ్యర్థి రబ్రీదేవిపై 40వేలకుపైగా మెజారీటీతో గెలిచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top