‘బాబు.. మీ పెంపుడు కుక్కను కంట్రోల్‌ చెయ్‌’

Kesineni Nani Continues Twitter War - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీకి తాజా రాజకీయ పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓ వైపు పలువురు నేతలు పార్టీని వీడుతుండగా.. మరోవైపు పార్టీలోని సీనియర్‌ నాయకుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కడం టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ కేశినేని నాని ఆదివారం ట్విటర్‌ వేదికగా బుద్ధా వెంకన్నపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి బుద్దా కూడా కౌంటర్‌ ఇచ్చారు. 

సోమవారం మరోసారి కేశినేని ట్విటర్‌ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు గారు.. నన్ను వద్దనుకుంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధం. నాలాంటి వాళ్లు పార్టీలో ఉండాలంటే.. మీ పెంపుడు కుక్కను కంట్రోల్‌ చేయండి’  కేశినేని ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే కేశినేని ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనేది తెలియాల్సి ఉంది. నిన్నపార్టీ నాయకులపై విమర్శలకు పరిమితమైన కేశినేని.. నేడు చంద్రబాబును హెచ్చరించే రీతిలో వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.

చదవండి : బుద్ధా వెంకన్నపై మరోసారి కేశినేని నాని ట్వీట్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top