ప్రతిపక్షాలకు ‘కరెంట్‌ షాక్‌’

Kejriwal Given Shock to Opposition Over Free Electricity  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ రాజకీయాలలో విద్యుత్తు ఎల్లప్పుడూ కీలకాంశంగానే ఉంటోంది. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చారిత్రక విజయం లభించడం వెనుక కూడా ‘బిజ్లీ హాఫ్‌’ హామీ ముఖ్యపాత్ర పోషించింది. సబ్సిడీ రేట్లకు విద్యుత్తు ఇస్తామన్న తమ ïహామీ తమ విజయానికి ముఖ్య కారణాలలో ఒకటన్న విషయాన్ని ఆప్‌ కూడా మరచిపోలేదు. అందుకే గత నాలుగున్నర సంవత్సరాలలో విద్యుత్తు చార్జీలు పెరగకుండా జాగ్రత్త పడింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమీçపిస్తున్న తరుణంలో 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితం చేసి ఓటర్లపై సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించింది. ఈ సమ్మోహనాస్త్రం అసెంబ్లీ ఎన్నికలలో ఆప్‌కు ఓట్ల జల్లు కురిపించే అవకాశం ఉంది.

చదవండిఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాయి. ఆప్‌ ప్రయోగించిన ఈ మాస్టర్‌ స్ట్రోక్‌ తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలో పడ్డాయి. ప్రతిపక్ష పార్టీలు గత కొద్ది నెలలుగా ఫిక్స్‌డ్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పుడు ఫిక్స్‌డ్‌ చార్జీలను 84 శాతం తగ్గించడమే కాక 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితం చేసి ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు.

షీలాదీక్షిత్‌ సర్కారు పరాజయం వెనుక పెరిగిన విద్యుత్తు చార్జీల ప్రభావం ఉందన్నది కాదనలేని అంశం. కేజ్రీవాల్‌ 2013 నుంచే పెరిగిన విద్యుత్తు చార్జీలను ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. ఈ విషయమై ఆయన అప్పట్లో 15 రోజుల పాటు నిరాహార దీక్ష కూడా చేశారు.ఆ తరువాత బిజ్లీ హాఫ్‌ పానీ మాఫ్‌ అనే నినాదంతో అధికారంలోకి వచ్చి ఈ హామీని అమలు చేశారు. ఇప్పుడు ఆప్‌ సర్కారు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితం చేసిç ³హలే హాఫ్‌ అబ్‌ మాఫ్‌ నినాదంతో ఓట్లు రాబట్టాలనుకుంటోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top