కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం షురూ: ప్రముఖ నటుడు

Kashmir Solution Has Begun Tweets Anupam Kher - Sakshi

శ్రీనగర్‌: ఏళ్ల నాటి కశ్మీర్‌ సమస్యను పరిష్కారించేందుకు ఎ‍ట్టకేలకు చర్యలు ప్రారంభం అయ్యాయని ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో అభిప్రాయపడ్డారు. కాగా గడిచిన వారం రోజులుగా కశ్మీర్‌లో భారత భద్రతాదళాలు మోహరిస్తోన్న విషయం తెలిసిందే. కశ్మీర్‌ సమస్యకు శాస్వత పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగుటు వేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనుపమ్‌ ఖేర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం ప్రారంభమైంది’ అంటూ పోస్ట్‌ చేశారు.

కాగా భారీ ఎత్తున బలగాల తరలింపుతో కశ్మీర్‌ను కేంద్రం పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆదివారం అర్థరాత్రి అనంతరం 144 సెక్షన్‌ అమలుతో పరిస్థితులు పూర్తిగా వేడెక్కాయి. ఇంటర్‌ నెట్‌ సేవలను నిలిపివేయడంతో పాటు.. పలు జిల్లాల్లో పూర్తి ఆంక్షాలను అమలుచేశారు. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాను గృహ నిర్బంధం చేయడంతో పాటు స్థానిక నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో కశ్మీర్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆసక్తికరంగా మారింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top