అధికారంలో లేకున్నా అభివృద్ధి

Kakani Govardan Reddy Fires On TDP - Sakshi

కార్యకర్తలను భుజాలకెత్తుకుని మోస్తా

సర్వేపల్లి ఎమ్మెల్యే  కాకాణి గోవర్ధన్‌రెడ్డి

పొదలకూరు: అధికారం లేకున్నా ప్రభుత్వంతో పోట్లాడి, న్యాయస్థానాల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పొదలకూరు మండలం మర్రిపల్లిలో రూ.35 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్లు, రూ.3 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ ప్రహరీలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ అధికారం ఉందని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అలాగే కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని అధికారం వస్తే మరువకుండా భుజాకెత్తుకుని మోస్తానన్నారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సర్పంచ్‌ కోసూరు అంకమ్మ చొరవ తీసుకుని 14వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ నిధుల భాగస్వామ్యంతో గ్రామంలో 90 శాతం సిమెంటు రోడ్లు నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. మర్రిపల్లి గ్రామం వైఎస్సార్‌ సీపీకి కంచుకోటగా మారిందన్నారు. పొదలకూరుకు దారి తెలియని వారు కూడా వచ్చి మండలాన్ని అభివృద్ధి చేశామని ప్రచారం చేసుకోవడం దురదృష్టకరమన్నారు. వారు మండలాన్ని సస్యశ్యామలం చేశామని బయట మండలాలకు వెళ్లి చెప్పుకుంటున్నట్టు ఆరోపించారు. ఇప్పటికీ కండలేరు ఎడమగట్టు కాలువ ద్వారా సాగునీరు అందే అవకాశం ఉండి నీరందని గ్రామాలు ఉన్నాయన్నారు.

చంద్రబాబుకు ఆ అర్హత లేదు
కర్ణాటకలో రాజ్యాంగం అపహాస్యం పాలైందని మాట్లాడే అర్హత సీఎం చంద్రబాబుకు లేదని ఎమ్మెల్యే కాకాణి దుయ్యబట్టారు. ఏపీలో 21 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. తమ పిలుపు మేరకే తెలుగు వారు కర్ణాటకలో బీజేపీకి ఓట్లేయలేదని చంద్రబాబు, మంత్రి సోమిరెడ్డి ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ ఊహించిన దానికంటే అధికంగా కర్ణాటకలో సీట్లు వచ్చినట్టు గుర్తుచేశారు. మర్రిపల్లిలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘనస్వాగం పలికారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కోసూరు అంకమ్మ, ఎంపీటీసీలు కండే సులోచన, కొల్లి రాజగోపాల్‌రెడ్డి, ఎస్యే అంజాద్, వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, నాయకులు కోసూరు సుబ్రహ్మణ్యం, గోగుల గోపాలయ్య, వెంపులూరు శ్రీనివాస్‌గౌడ్, పాలూ రు పెంచలయ్య, మాలపాటి పెంచలరెడ్డి, మాలపాటి గోపాల్‌రెడ్డి, రావుల అంకోజీ, ముక్కు వెంకటేశ్వర్లు, వెంపులూరు వెంకటేశ్వర్లు, వై.వెంకటేశ్వర్లుగౌడ్, తాళ్ల రాజా, ఎన్‌.సుబ్రమణ్యం పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top