చంద్రబాబు అంటే మోదీకి ఈర్ష్య, ద్వేషం

JC Diwakar Reddy Sensational Comments on PM Modi and Cm Chandrababu - Sakshi

టీడీపీ ఎంపీలు రాజీనామా చేసినా ప్రయోజనం ఉండదు

మోదీ వాళ్ల స్థానంలో ఇంకొకరికి పదవి ఇస్తారు : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి

సాక్షి, అమరావతి : గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి థర్డ్‌ ఫ్రంట్‌లో కీలకంగా ఉన్నారని, వాటి దృష్ట్యా చంద్రబాబు అంటే బీజేపీకి భయం ఉండవచ్చని టీడీపీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అంటే ప్రధాని మోదీకి ఈర్ష్య, ద్వేషం ఉన్నాయని చెప్పారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో జేసీ మీడియాతో మాట్లాడారు. ఏపీకి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తే చంద్రబాబు రాజకీయంగా ఎదుగుతారన్న భయం వారికి ఉందన్నారు.

చంద్రబాబు ఉన్నత స్థాయికి వెళ్లాలని రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ లాంటి వారే కోరుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలంతా కాంగ్రెస్‌ పార్టీ మద్దతు కోరామని తెలిపారు. ప్యాకేజీ పేరుతో ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాలు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండబోదని, వీళ్ల స్థానంలో బీజేపీ వాళ్లకు కేంద్ర మంత్రులుగా మోదీ అవకాశం కల్పిస్తారని తెలిపారు.

Back to Top