జనసేనలో భగ్గుమన్న విభేదాలు

janasena Party Candidates Disputes In Payakaraopeta Constituency - Sakshi

సాక్షి, విశాఖపట్నం : నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది. అయితే విశాఖలోని పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన జనసేన అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. జనసేన నుంచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్‌ వేయడంతో వారి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో జనసేన అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రావడం లేదు. నక్కా రాజబాబు, శివదత్‌లు జనసేన పార్టీ తరుపున పాయకరావుపేట నియోజకవర్గానికి నామినేషన్లు వేశారు. అయితే తనకు ప్రాణహాని ఉందని రాజబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ పార్టీలోని విభేదాలు బట్టబయలయ్యాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top