‘జన్‌ధన్‌ లూట్‌ యోజన’

Jan Dhan Loot Yojana: Thats how Rahul Gandhi trolled Modi government for string of scams - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీకి చెందిన ఓ జ్యూవెలర్‌ ఓబీసీ బ్యాంక్‌ను రూ 390 కోట్లకు ముంచిన మరో కుంభకోణం వెలుగు చూసిన క్రమంలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ మోదీ సర్కార్‌పై ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ‘మోదీజీ ‘జన్‌ధన్‌ లూట్‌ యోజన’ కింద మరో స్కామ్‌..ఢిల్లీ జ్యూవెలర్‌ రూ 390 కోట్ల బడా మోసం’ అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. నకిలీ పత్రాలతో గత కుంభకోణాల తరహాలోనే రూ 390 కోట్ల స్కామ్‌ కూడా సాగిందని..ఈ కేసులో నిందితుడు కూడా ఉడాయించాడన్నారు.

నీరవ్‌ తరహాలోనే నకిలీ ఎల్‌ఓయూలతో బ్యాంకులను బురిడీ కొట్టించిన నిందితుడు..మాల్యా, నీరవ్‌ మాదిరిగా  అదృశ్యమయ్యాడని ట్వీట్‌ చేశారు. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంటే నిందితుడు పారిపోయాడని చురకలు అంటించారు. ఓబీసీ నుంచి నకిలీ ఎల్‌ఓసీలతో మోసపూరితంగా రూ 389 కోట్ల రుణం పొందిన ఢిల్లీకి చెందిన జ్యూవెలర్‌ కంపెనీ డైరెక్టర్లు సవ్యసేథ్‌, రీటాసేథ్‌, కృష్ణకుమార్‌ సింగ్‌, రవి సింగ్‌లపై సీబీఐ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో రాహుల్‌ తాజా ట్వీట్‌ చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top