సీఎం కేసీఆర్ మాదిగల వ్యతిరేకి: జగ్గారెడ్డి

సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మాది గల వ్యతిరేకిగా వ్యవ హరిస్తున్నారని ప్రభుత్వ మాజీ విప్ టి.జగ్గారెడ్డి సోమ వారం మండిపడ్డారు. మాదిగల హక్కుల కోసం పోరాడుతున్న మంద కృష్ణపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరో పించారు. దీనిపై టీఆర్‌ఎస్ మాదిగ నేత లెందుకు స్పందించడం లేదని ప్రశ్నిం చారు.
మంద కృష్టను జైల్లో పెట్టడమంటే మాదిగ జాతిని జైల్లో పెట్టినట్టేనన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసుల సంగతి తేలుస్తామని హెచ్చరిం చారు. గవర్నర్ సైతం రాజ్యాంగ పరిరక్ష కుడిగా వ్యవహరించడం లేదన్నారు. మూడేళ్లుగా ప్రకటనలకే పరిమితమైన సీఎం ఎన్నికలు సమీపిస్తుండటంతో రైతు ల జపం చేస్తున్నారని విమర్శించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి