కడప టీడీపీలో వర్గపోరు

Infighting Rocks TDP in YSR District - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కడపలో టీడీపీలో వర్గపోరు బయటపడింది. టీడీపీకి చెందిన కాపు నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. టీడీపీలో కాపులను అణగదొక్కుతున్నారని రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. టీడీపీ జిల్లా కార్యదర్శి హరిప్రసాద్‌కు అడా చైర్మన్‌ పదవి తీసేయడంపై టీడీపీ కాపు నేతలు నిరసన తెలుపుతున్నారు. కాపుల ఎదుగుదలకు జిల్లా అధ్యక్షుడు అడ్డుపడుతున్నారని, ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలానే కాపులకు కడప ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకపోవడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top